Heart Health Foods: మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే, ఆరోగ్యాంగా ఉండాలంటే, శరీరానికి అవసరమైన పోషకాలను సరైన మొత్తంలో తీసుకోవడం చాలా ముఖ్యం. వీటిలో ఒకటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు. ఇవి బలమైన గుండెకు ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాదు, మెదడు, రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో ఒమేగా-3 లోపం ఉంటె గుండె జబ్బుల ప్రమాదం, అలసట, చర్మ సమస్యలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలను డైట్ లో ఉండేలా చూసుకోవాలి. ఈ క్రమంలో ఒమేగా-3 లు అధికంగా ఉండే ఐదు ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
చేప: సాల్మన్, సార్డిన్స్, ట్యూనా, మాకేరెల్ వంటి కొవ్వు చేపలు ఒమేగా-3 లకు అద్భుతమైన వనరులు. వీటిని వారానికి 2-3 సార్లు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇవి మెదడు పనితీరును బలోపేతం చేస్తాయి.
also read:Healthy Fruits: వయసు పెరిగే కొద్దీ ఆడవాళ్లంతా తప్పక తినాల్సిన పండ్లు..
అవిసె గింజలు: అవిసె గింజలు శాఖాహారులకు ఒమేగా-3 లకు అద్భుతమైన మూలం. వీటిని స్మూతీలు, సలాడ్లలో తినవచ్చు. ఈ విత్తనాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాదు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
వాల్‌నట్స్: వాల్‌నట్స్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. రోజుకు 4-5 వాల్‌నట్స్ తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
చియా విత్తనాలు: ఇందులో కూడా ఒమేగా-3లలో సమృద్ధిగా ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టి స్మూతీలు, పెరుగు లేదా డెజర్ట్‌లలో చేర్చవచ్చు. ఇవి బరువును తగ్గించడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.
సోయాబీన్స్: సోయాబీన్స్, టోఫు వంటి ఉత్పత్తులలో మంచి మొత్తంలో ఒమేగా-3లు ఉంటాయి. ఇవి శాఖాహారులకు ఆరోగ్యకరమైన, ప్రోటీన్-రిచ్ ఎంపిక. ఇవి ఎముకలు బలంగా చేస్తాయి. గుండెను ఆరోగ్యాంగా ఉంచి, పనితీరును మెరుగుపరుస్తాయి.


