Saturday, November 15, 2025
Homeహెల్త్Liver: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ అలవాట్లు తప్పనిసరి!

Liver: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ అలవాట్లు తప్పనిసరి!

Liver Health: మన శరీరంలో ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. లివర్ శరీరంలో అనేక విషాలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. ఇది జీవక్రియను సమతుల్యంగా ఉంచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. కావున దీన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత. నేటి జీవనశైలి, తప్పుడు ఆహార అలవాట్లు లివర్ కు అనేక సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. అయితే, మన దినచర్య, కొన్ని ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకుంటే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ చిన్న అలవాటులను అలవర్చుకోవడం ద్వారా కాలేయం దెబ్బ తినడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు లివర్ ఆరోగ్యానికి కోసం అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

- Advertisement -

జంక్, ప్రాసెస్ చేసిన ఆహారాలు

మన నోటి రుచి కోసం ఫాస్ట్ ఫుడ్, ప్యాక్ చేసిన స్నాక్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకుంటాం. ఇవి లివర్ పై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. ఎందుకంటే వీటిలో ట్రాన్స్ ఫ్యాట్, ప్రిజర్వేటివ్స్,ఎక్కువగా ఉప్పు, చక్కెర ఉంటాయి. కాలేయం పనితీరు మెరుగ్గా ఉండాలంటే తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, ఇంట్లో తయారు చేసిన ఆహారాలు తీసుకోవాలి.

మద్యం, ధూమపానం

మద్యం, ధూమపానం వల్ల లివర్ పనితీరు తగ్గిపోతుంది. అధికంగా మద్యం, సిగరెట్లు తాగడం వల్ల కాలేయ కణాలు దిబ్బతింటాయి. ఆల్కహాల్ తాగడం వల్ల కాలేయం నిర్వీకరణ సామర్థ్యం తగ్గుతుంది. పైగా ఇది ఫ్యాటీ లివర్, సిరోసిస్ కు దారితీస్తుంది.

Also Read: Children Height: ఈ సూపర్ ఫుడ్స్ తింటే.. మీ పిల్లలు స్పీడ్ గా హైట్ పెరుగుతారు!

తగినంత నీరు

రోజు తగినంత నీరు తాగితే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. దీనికోసం ప్రతి రోజు 8- 10 గ్లాసుల నీరు త్రాగాలి. తద్వారా శరీరంలో విష పదార్థాలు సులభంగా బయటికి వెళ్లిపోతాయి. దీంతో కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం

వ్యాయామం చేయడం కేవలం లివర్ కు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. వ్యాయామం చేయడం ద్వారా జీవక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇది కొవ్వు పేరుకు పోవడాన్ని నివారిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు 30 నిమిషాలు వాకింగ్, యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇది కాలేయంపై కొవ్వు బారాన్ని తగ్గిస్తుంది.

మాత్రలు తీసుకోవడం

ఏదైనా సమస్య వస్తే సొంత తెలివితో వైద్యుడిని సంప్రదించకుండా మాత్రలు తీసుకోకూడదు. ముఖ్యంగా నొప్పి నివారణ మందులు, యాంటీబయోటిక్స్, లేదా సప్లిమెంట్లను తీసుకోవడం మానుకోవాలి. ఇవి కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. దీర్ఘకాలంలో కలయాన్ని దెబ్బతీస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad