Saturday, November 15, 2025
Homeహెల్త్Vegetables: ఈ కూరగాయలు తొక్కతో పాటు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!

Vegetables: ఈ కూరగాయలు తొక్కతో పాటు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!

Vegetables to Be Eaten With Peel: సాధారణంగా మనం తినే కూరగాయలను తొక్క తీసిన తర్వాతే వండుకుని తింటుంటాం. దీనికి ప్రధాన కారణం కూరగాయల తొక్కపై ఉండే మట్టి లేదా ధూళి. అందువల్ల తొక్క తీసిన తర్వాతే మన ఆహారంలో భాగం చేసుకుంటాం. అయితే, కొన్ని కూరగాయల తొక్కలలో అనేక పోషకాలు ఉంటాయని మీకు తెలుసా..? కొన్ని కూరగాయల తొక్కలలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే, ఇప్పుడు తొక్కతో పాటు తినవలసిన 5 కూరగాయల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

బంగాళాదుంప

బంగాళాదుంపను తరచుగా తొక్క తీసిన తర్వాత వండుకుంటాం. కానీ, దాని తొక్కలో ఫైబర్, ఐరన్, పొటాషియం, విటమిన్-సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో బంగాళాదుంపను తొక్కతో తింటే జీర్ణవ్యవస్థ బలపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. బంగాళాదుంప తొక్కలో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లం శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది.

దోసకాయ

దోసకాయ తొక్కలో విటమిన్ కె, పొటాషియం, సిలికా వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మం సమస్యల నుండి కాపాడుతుంది. ఎముకలు బలంగా ఉంటాయి. దోసకాయ లో 95 శతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

Also Read: Avoid these fruits: వర్షాకాలంలో తినకూడని పండ్లు..

క్యారెట్

క్యారెట్ తొక్కలో బీటా-కెరోటిన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని తినడం వల్ల కళ్ళు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్-ఎ సమృద్ధిగా ఉండటం వల్ల క్యారెట్ రాత్రి అంధత్వం, కంటిశుక్లం నివారిస్తుంది. అలాగే, ఇది కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

వంకాయ

వంకాయ తొక్కలో ఉండే నాసునిన్ యాంటీఆక్సిడెంట్ మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిని తినడం వల్ల అల్జీమర్స్, జ్ఞాపకశక్తిని నివారిస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది గుండెకు ఎంతో మంచిది.

చిలగడదుంప

చిలగడదుంప తొక్కలో విటమిన్ ఎ, సి, బీటా-కెరోటిన్ ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చిలగడదుంప తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అలాగే, ఉందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల చాలా సమయం పాటు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

గమనిక: ఈ కూరగాయల తొక్కతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, తినడానికి ముందు వాటిని బాగా కడగాలి. తద్వారా దానిపై ఉన్న మురికి, ధూళి పూర్తిగా తొలిగిపోతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad