Sunday, October 6, 2024
Homeహెల్త్Tiny tips: చిన్ని చిట్కాలు

Tiny tips: చిన్ని చిట్కాలు

 ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చటి నిమ్మ నీళ్లు తాగితే ముఖం కాంతివంతంగా ఉంటుంది.
 చర్మంపై ఉన్న మ్రుతకణాలు పోవాలంటే చర్మంపై పెరుగు రాసుకుని ఐదు నిమిషాలు గట్టిగా రుద్దాలి. ఇలా చేస్తే చర్మం మ్రుదువుగా ఉండడంతో పాటు బాగా మెరుస్తుంది.
 రెండు టీస్పూన్ల కొబ్బరినూనెలో రెండు చిటికెళ్ల ఉప్పు వేసి ఆ మిశ్రమంలో వేళ్ల చిగుళ్లను పదిహేను నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్లల్లో తడిపిన గుడ్డతో వేళ్లను శుభ్రంగా తుడుచుకోవాలి.ఇలా చేయడం వల్ల గోళ్లు రెండు రెట్ల వేగంతో పెరగడమే కాకుండా ఆరోగ్యంగా, ద్రుఢంగా ఉంటాయి.

- Advertisement -

 నిమ్మరసం నీటితో ముఖం ఆవిరి పట్టుకుంటే చర్మం పరిశుభ్రమవుతుంది. యాక్నే, మొటిమల సమస్యలు తగ్గుతాయి. ముఖం మీది చర్మం కాంతివంతమవుతుంది.

 వారానికి ఒకరోజు నీటిని మాత్రమే తీసుకుంటూ ఉపవాసం ఉండడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యం బాగుంటుంది.
 రాత్రి పడుకోబోయే ముందు గ్రీన్ టీ తాగడం వల్ల నిద్రపోయేటప్పుడు శరీరంలోని కాలరీలు తగ్గుతాయి.
అంతేకాదు గ్రీన్ టీ జీర్ణక్రియ బాగా జరిగేలా చేస్తుంది.
 ఒక టీస్పూను పసుపు, ఒక టీ స్పూను పెరుగు తీసుకుని మెత్తని పేస్టులా చేసి కళ్ల కింద రాసుకొని ఐదు నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే కళ్ల కింద ఏర్పడ్డ నల్లటి వలయాలు తగ్గుతాయి.

 గోరువెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల తాజా అలొవిరా జల్ వేసి ముఖానికి ఆవిరి పట్టుకుంటే చర్మం మ్రుదువుగా, ఆరోగ్యంగా ఉండడంతోపాటు మెరుస్తుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మంపై మంచి ప్రభావం చూడొచ్చు.

 ముఖంపై మొటిమలు రాకుండా ఉండాలంటే టీ తాగకుండా ఉండాలి. నూనె వస్తువులు తినకూడదు. నిద్రపోయే ముందు ముఖం చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఒత్తిడికి గురికాకూడదు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. అలాగే వేడిగా ఉన్న పదార్థాలను అస్సలు తినకూడదు.
 బాగా నిద్రపోవడం వల్ల చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండడమే కాదు మంచి మెరుపును కూడా సంతరించుకుంటుంది.
 కాటన్ గుడ్డలో రెండు ఐస్ క్యూబ్స్ పెట్టి దానితో ముఖం రుద్దుకుంటే కళ్ల కింద ఏర్పడ్డ నల్లటి వలయాలు పోతాయి. చర్మ రంధ్రాలు దెబ్బతినవు. ఇది యాక్నే సమస్యను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు కళ్ల చుట్టూ ఏర్పడ్డ వాపు, ఉబ్బరింపులు కూడా దీనివల్ల తగ్గుతాయి. చర్మంపై ఏర్పడ్డ గీతలు సైతం పోతాయి.

 చర్మం సహజసిద్ధమైన మెరుపును పొందాలంటే పచ్చిపాలతో ముఖంపై వేళ్లతో ఐదు నిమిషాలు రబ్ చేయాలి. ఆ తర్వాత టేబుల్ స్పూను పెరుగు, చిటికెడు పసుపు, అరటేబుల్ స్పూను నిమ్మరసం మూడింటినీ కలిపి మెత్తటి పేస్టులా చేసి దాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. సహజమైన మెరుపుతో ముఖం వెలిగిపోతుంది.
 ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చటి నీళ్లు, అల్లం ముక్క కలిపి తీసుకుంటే చర్మం ఎంతో అందంగా తయారవడమే కాకుండా బోలెడు మెరుపును సంతరించుకుంటుంది.
 కాళ్ల చర్మంపై ఏర్పడ్డ మ్రుతకణాలు పోవాలంటే అరకప్పు కాఫీపొడి, అరకప్పు తాటిబెల్లం, పావుకప్పు కొబ్బరినూనె తీసుకుని స్క్రబ్ లా చేసి దాన్ని కాళ్లకు రాసి మసాజ్ చేసి ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి.
 ఉదయం పూట రోజూ ఐదారు బాదం పప్పులు తినడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. శిరోజాలు ద్రుఢంగా, నిగనిగలాడుతూ ఉంటాయి. చర్మం కావాలసినంత తేమను పొందుతూ మ్రుదువుగా పట్టులా
తయారవుతుంది. జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది. బాదం తినడం వల్ల ఆకలివేయదు. ఫలితంగా బరువు తగ్గుతారు.
 కమలాఫలాలు తింటే చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. కీరకాయ శరీరానికి కావాలసినంత నీటిని అందిస్తుంది.
 కొద్దిగా పసుపు తీసుకుని అందులో కొన్ని పాలు పోసి పేస్టులా చేసి దాన్ని పెదాలకు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నల్లటి పెదాలు మెరుపును సంతరించుకుంటాయి. మ్రుదువుగా తయారయి చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి.

 బీట్రూట్ జ్యూసు, టొమాటో జ్యూసులు శరీరారోగ్యానికి ఎంతో మంచివి మాత్రమే కాదు మనల్ని నిత్య యవ్వనులుగా కనిపించేలా చేస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News