Friday, September 20, 2024
Homeహెల్త్Tooth pain: పన్ను పోటు నుంచి ఉపశమనం ఎలా?

Tooth pain: పన్ను పోటు నుంచి ఉపశమనం ఎలా?

పంటి పోటు కలిగించే బాధ అంతా ఇంతా కాదు. అందులోనూ రాత్రిపూట ఇది తలెత్తితే అస్సలు నిద్రపోలేము. అలాంటి సమయాల్లో ఆ బాధ నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి. అవేమిటంటే…

- Advertisement -

 పంటి నొప్పి తగ్గడానికి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూను ఉప్పు కలిపి ఆ నీళ్లతో నోరు శుభ్రంగా కడుక్కుంటే మంచిది.

 లవంగనూనె కూడా పంటి నొప్పిని తగ్గిస్తుంది. ఈ నూనెలో ముంచిన దూదితో నొప్పి పెడుతున్న పన్ను భాగంలో రాసుకుంటే నొప్పి నుంచి కొంచెం సాంత్వన కనిపిస్తుంది.

 యాంటీబాక్టీరియల్ మౌత్ వాష్ పళ్లసందుల్లో చేరిన ఆహారపదార్థాలను తొలగిస్తుంది. పళ్ల మీద ఏర్పడ్డ మందమైన గార వల్ల తలెత్తే ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. అంతేకాదు ఇది దంతక్షయాన్ని తగ్గిస్తుంది. పంటి నొప్పి, ఇన్ఫెక్షన్ల నుంచి కూడా కాపాడుతుంది. యాంటీబాక్టీరియల్ మౌత్ వాష్ పళ్ల చిగుళ్లు, బుగ్గల్లో తలెత్తే మంటను, ఇన్ఫెక్షన్లను, ఇరిటేషన్లను నివారిస్తుంది.

 పంటినొప్పి ఉన్న చోట కోల్డ్ కంప్రసర్ని పెట్టుకుంటే కూడా పంటిపోటు నుంచి సాంత్వన లభిస్తుంది. చల్లదనం వాపును, మంటను తగ్గిస్తుంది.

 పంటినొప్పి నుంచి తాత్కాలికంగా బయటపడటానికి వైద్యుల సలహాతో పెయిన్ రిలీవర్స్ వాడొచ్చు.

 నాలుగైదు దిండ్లను తలకింద పెట్టుకుని ఎత్తుగా తలను పెట్టుకుని పడుకుంటే కూడా పంటినొప్పి కాస్త తగ్గుతుంది.

 పంటినొప్పిని మరింత పెంచే ఫుడ్స్, డ్రింకులను తీసుకోవద్దు.

 వేడి లిక్విడ్స్ ను తీసుకోకుండా చల్లటి వాటిని తీసుకుంటే పంటినొప్పి నుంచి కొద్దిగా సాంత్వన పొందగలరు.

 టూత్ పిక్ తో నొప్పి పెడుతున్న పంటి భాగంలో శుభ్రంచేసుకోవడం వల్ల చిగుళ్లల్లో చిక్కుకున్న ఆహార పదార్థాలు పోయి శుభ్రం అయి పన్ను నొప్పి తగ్గుతుంది. డెంటల్ ఫ్లోస్ చేసుకోవడం వల్ల కూడా పంటి నొప్పి తగ్గుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News