Saturday, November 15, 2025
Homeహెల్త్FITNESS HACKS: నడకలో 'కొత్త' అడుగు.. తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనం!

FITNESS HACKS: నడకలో ‘కొత్త’ అడుగు.. తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనం!

Different types of walking for health : నడక.. ఆరోగ్యానికి శ్రీరామరక్ష! ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, రోజూ ఒకేలా నడిచి విసుగొచ్చిందా? తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనాలు పొందాలని ఆశిస్తున్నారా? అయితే, మీకోసమే ఈ ప్రత్యేక కథనం. సాధారణ నడకకు కొన్ని ‘షార్ట్‌కట్లు’ జోడించి, మీ వాకింగ్‌ను ఓ సంపూర్ణ వ్యాయామంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అసలు ఏమిటా వినూత్న నడక పద్ధతులు..? వాటివల్ల కలిగే ప్రత్యేక ప్రయోజనాలేంటి..?

- Advertisement -

ఆరోగ్యానికి ‘కొత్త’ నడకలు : మన రోజువారీ వాకింగ్‌లో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా, అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.

 సిద్ధ నడక (ఎనిమిది ఆకృతిలో):  ఒకే ప్రాంతంలో, నేలపై ‘8’ అంకె ఆకృతిలో అటు ఇటూ తిరుగుతూ నడవడం.
ప్రయోజనం: ఇది కేవలం శారీరక వ్యాయామమే కాదు, ఓ మానసిక సాధన కూడా. ఏకాగ్రతను పెంచి, ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

రివర్స్ వాకింగ్ (వెనక్కి నడవడం): ముందుకు కాకుండా, జాగ్రత్తగా వెనక్కి అడుగులు వేస్తూ నడవడం.
ప్రయోజనం: ఇది మోకాళ్ల కండరాలను బలోపేతం చేసి, కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది అద్భుతమైన వ్యాయామం అని ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ (National Library of Medicine) అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరాకృతిని (Posture) నిటారుగా మార్చడంలోనూ సహాయపడుతుంది.

తడాసన నడక (చేతులు పైకెత్తి): రెండు చేతుల వేళ్లను కలిపి, పైకెత్తి, అరికాళ్లు నేలకు తగలకుండా మునివేళ్లపై నడవడం.
ప్రయోజనం: యోగాలోని పర్వతాసనాన్ని పోలి ఉండే ఈ నడక, శరీరంలోని ప్రధాన కండరాలను దృఢంగా మారుస్తుంది. రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా ఉంచుతుంది.

కాకి నడక (స్క్వాట్ వాక్): స్క్వాట్ భంగిమలో (కాకిలా) కూర్చుని, రెండు చేతులతో మోకాళ్లను పట్టుకుని ముందుకు నడవడం.
ప్రయోజనం: పొట్ట కండరాలను బలోపేతం చేసి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఎందుకీ మార్పు : డయాబెటిస్, ఊబకాయం, పీసీఓఎస్ వంటి జీవనశైలి వ్యాధులు నేడు సర్వసాధారణమయ్యాయి. వీటికి శారీరక శ్రమ తగ్గడమే ప్రధాన కారణం. సాధారణ నడక మంచిదే అయినా, ఈ వినూత్న పద్ధతులను జోడించడం వల్ల, శరీరంలోని వివిధ కండరాలపై ప్రభావం పడి, తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాలను పొందవచ్చు.

ముఖ్య గమనిక: కొత్తగా ఈ నడక పద్ధతులను ప్రయత్నించేవారు, నెమ్మదిగా, జాగ్రత్తగా ప్రారంభించాలి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఉన్నవారు, వైద్యులు లేదా ఫిట్‌నెస్ నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad