రోజ్ డే వస్తోంది…అదేనండి ప్రేమికుల రోజు దగ్గరకొస్తోంది కదా. ఆ రోజు మెరిసే చర్మంతో మీ లవర్ని మైమరిపించాలనుకుంటున్నారా… మరి అందుకోసం గులాబీ ఎక్స్ ట్రాక్టులతో తయారుచేసిన కొన్ని బ్యూటీ ఉత్పత్తులు మీకోసం….
గులాబిపూరెక్కలు కలిపి చేసిన మంత్ర ఆలో, అవకెడో, ఆల్మండ్ మాయిశ్చరైజర్ మీ చర్మాన్ని కాంతివంతం చేయడమే కాదు చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ ని కూడా అందిస్తుంది. మీ చర్మం మెరుపును పెంచుతుంది. అంతేకాదు మీ చర్మాన్ని మ్రుదువుగా, పట్టులా మెరిసేలా చేస్తుంది. స్కిన్ టోనింగ్ ను పెంచుతుంది. పింక్ రోజ్ క్లే మరొకటి. ఇది ఫేస్ మాస్కు. గులాబీరెక్కలను కలిపి చేసిన ఈ మాస్కు అలసినట్టు ఉన్న మీ చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. ముఖంపై పేరుకున్న మ్రుతకణాల పొరను పోగొడుతుంది. రోజ్ వాటర్, పాలు కలిపి తయారుచేసినది మామెర్త్ బాడీ లోషన్. ఇది చర్మాన్ని అందంగా మలిచే బాడీ లోషన్. దీన్ని రాసుకోవడం వల్ల స్కిన్ టెక్స్చెర్ బాగుంటుంది. ఇది చర్మం లోపలివరకూ హైడ్రేషన్ను అందిస్తుంది. ఇందులో షియా బటర్, ఆలివ్ ఆయిల్, పాలు కూడా ఉన్నాయి. వీటివల్ల చర్మం ఎంతో కాంతిని సంతరించుకుంటుంది.
రోజ్ బాడీ మిస్ట్ ఇంకొకటి. ఇది మహిళల కోసం రూపొందించిన ఫ్లోరల్ బాడీ స్ప్రే. ఈ స్ప్రే గులాబీ పువ్వుల గుబాళింపును చిందిస్తూ మూడ్ ఎన్ హాన్సర్ గా పనిచేస్తుంది. గులాబీల పరిమళంతో నిండి ఉన్న ఈ బాడీ స్ప్రే మీ డేట్ నైట్ ను మరింత రొమాంటిక్ గా మలుస్తుంది. రోజ్ బాడీ మిస్ట్ సువాసనలు మూడు గంటల పైగా మీ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. వేగాన్ బ్రిటీష్ రోజ్ బాడీ బటర్ మరొకటి. ఇది చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ ని అందివ్వడమే కాకుండా చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. మనదేశపు గులాబీ సువాసనలను ఇది చిందిస్తుంది. శరీరాన్ని తాజాగా ఉంచుతుంది.
డాట్ అండ్ కీ స్మూదింగ్ జెల్ బాడీ స్క్రబ్ ఇంకొకటి. ఇది మీ చర్మంపై ఉండే మ్రుతకణాలను పొగొట్టి చర్మం మిల మిల మెరిసేలా చేస్తుంది. ఇందులో రోజ్, లావెండర్లు కూడా ఉన్నాయి. ఈ స్క్రబ్ చర్మాన్ని తాజాగా, కాంతివంతంగా, మ్రుదువుగా ఉండేలా చేస్తుంది. ఈ స్క్రబ్ లోని వాల్నట్ పలుకులు చర్మానికి మంచి ఎక్స్ఫొయిలేటర్ గా పనిచేస్తుంది. చర్మంపై ఉన్న మ్రుతకణాల పొరను పోగొడుతుంది. అంతేకాదు చర్మాన్ని లోపలివరకూ హైడ్రేట్ చేస్తుంది. అన్ని రకాల చర్మంవారిపైనా ఇది బాగా పనిచేస్తుంది.
బ్రియాన్ అండ్ క్యాండీ డెలికేట్ రోజ్ లగ్జరీ ఫోమింగ్ బాడీ వాష్ లో కూడా సహజసిద్ధమైన గులాబీల ఎక్స్ ట్రాక్టులు ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిపిస్తాయి. అంతేకాదు 48 గంటల పాటు చర్మానికి కావలసిన హైడ్రేషన్ ని అందిస్తాయి. ఈ బాడీ వాష్ గులాబీ గుబాళింపులను చిందిస్తుంది. అన్ని రకాల చర్మం వారిపై ఈ బాడీ వాష్ బాగా పనిచేస్తుంది. వీటిని వాడే ముందు మీరు తప్పనిసరిగా చర్మనిపుణులను ఒకసారి సంప్రదించడం మరవొద్దు.