వైట్ వెనిగర్ తో స్నానాల గది మిలమిల..
స్నానాలగదిలో ఉండే స్టీలు కుళాయిల మీద ఏర్పడే మచ్చలు పోవాలంటే చిన్న గుడ్డ తీసుకుని దానిపై వైట్ వెనిగర్ వేసి తుడిస్తే చాలు అవి మెరుస్తాయి. అలాగే టాయ్లెట్ బౌల్ శుభ్రంగా ఉండాలంటే వైట్ వెనిగర్ వేసి ముప్ఫైనిమిషాలు అలాగే ఉంచి ఆతర్వాత నీటితో కడిగేస్తే శుభ్రంగా ఉంటుంది. బాత్రూములో ఉండే టబ్, సింకుల్లో ఏర్పడ్డ మొండి మరలకు పోవాలటే వైట్ వెనిగర్ని వాటిపై స్ప్రే చేసి పది నిమిషాలు అలాగే ఉంచితే చాలు అవి తళ తళ మెరుస్తాయి.
ఒకటి లేదా రెండు కప్పుల వైట్ వెనిగర్ లో షవర్ కర్టెన్ను ముంచి ఉతికితే బాగా శుభ్రం అవుతుంది. సగం వైట్ వెనిగర్, సగం నీళ్లు కలిపిన మిశ్రమంతో స్నానాలగదిలోని అద్దాన్ని తుడిస్తే చాలు అది తళ తళలాడుతుంది. అలాగే స్నానాలగదిలోని టైల్స్ ను కూడా సగం వైట్ వెనిగర్, సగం నీళ్లు కలిపిన మిశ్రమంతో శుభ్రం చేస్తే ఎంతో శుభ్రంగా ఉండి మిల మిల మెరుస్తాయి.