Iraq shopping mall fire: తూర్పు ఇరాక్‌లోని అల్-కుట్ నగరంలోని ఒక షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 50 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని వాసిత్ ప్రావిన్స్ గవర్నర్ మొహమ్మద్ అల్ మియాహి అధికారిక ఐఎన్ఏ వార్తా సంస్థకు తెలిపారు.
ఈ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలో గత రాత్రి సిటీలోని ఓ ఐదు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగినట్లు చూపించారు. పైర్ యాక్సిడెంట్ కు గల కారణాలు తెలియరాలేదు. మరో 48 గంటల్లో పూర్తి వివరాలు తెలియజేస్తామని ఆ ప్రాంతం గవర్నర్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
بالفيديو | واسط : هذا ما تبقى من “هايبر ماركت الكوت” الذي أتت عليه النيران بالكامل ، بعد أيام قليلة من افتتاحه#قناة_الغدير_الخبر_في_لحظات pic.twitter.com/QqOQ1OVCSY
— قناة الغدير (@alghadeer_tv) July 16, 2025
ఈ అల్-కుట్ నగరం రాజధాని బాగ్దాద్‌కు ఆగ్నేయంగా 160 కి.మీ (100 మైళ్ళు) దూరంలో ఉంది. ఫైర్ యాక్సిడెంట్ బాధితులతో ఉదయం 4 గంటల వరకు అంబులెన్స్ లు తిరుగుతూనే ఉన్నాయని.. ఆస్పత్రిలో పడకలు నిండిపోయాయని ఓ వార్త సంస్థ రాసుకొచ్చింది. మంటలు మెుదటి అంతస్తులో ప్రారంభమైనట్లు ప్రాథమిక నివేదికలు తెలుపుతున్నాయి. మియాహి.. ప్రావిన్స్‌లో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించనున్నారు. అంతేకాకుండా స్థానిక అధికారులు మాల్ యజమానిపై దావా వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మాల్ ఐదు రోజుల క్రితమే తెరవబడినట్లు సమాచారం.


