Saturday, October 5, 2024
Homeఇంటర్నేషనల్America: టిక్ టాక్ బాన్ సంపూర్ణ అమలుకు 30 రోజుల గడువు

America: టిక్ టాక్ బాన్ సంపూర్ణ అమలుకు 30 రోజుల గడువు

టిక్ టాక్ నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేసేందుకు 30 రోజుల గడువు ఇచ్చింది వైట్ హౌస్. మిలియన్లకొద్దీ అమెరికన్లు టిక్ టాక్ ను విచ్చలవిడిగా నిత్యం ఉపయోగిస్తున్నారు. చైనీస్ యాప్ అయిన టిక్ టాక్ ను అమెరికా నిషేధించినా అమలు మాత్రం కావటం లేదు. దీంతో ఫెడరల్ ఏజెన్సీలకు 30 రోజుల గడువు ఇచ్చింది. చైనీస్ ఓన్డ్ వీడియో స్నిప్పెట్ షేరింగ్ యాప్ టిక్ టాక్ ను అమెరికన్ గవర్నమెంట్ డివైజుల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

- Advertisement -

అన్ని వయసుల వారికి అడిక్టివ్ గా మారిపోయిన ఈ యాప్ ద్వారా చైనా స్పైయింగ్ చేస్తున్నట్టు, ఈ నిఘా నీడ నుంచి తప్పించుకునేందుకే టిక్ టాక్ పై బ్యాన్ విధించినట్టు అమెరికన్ ప్రభుత్వం తన చర్యలను సమర్థించుకుంది. కానీ ఇలా చేయటమంటే స్వేచ్ఛను హరించటమే అంటూ ఏసీఎల్యూ ( American Civil Liberties Union) విమర్శలకు దిగింది. జాతీయ భద్రతకు ఈ యాప్ తో ముప్పున్న కారణంగా సర్కారీ డివైజుల నుంచి ఈ యాప్ ను సంపూర్ణంగా తొలగించాలని జో బైడెన్ సర్కారు గత నెల్లో ఆదేశాలు జారీచేసింది. ఇటు కెనడా సర్కారు కూడా టిక్ టాక్ ను నిషేధించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News