Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Baba Vanga: 2026లో క్యాష్‌ క్రష్‌.. ప్రపంచ ఆర్థిక మాంద్యం సూచనలతో వణుకు పుట్టిస్తున్న బాబా...

Baba Vanga: 2026లో క్యాష్‌ క్రష్‌.. ప్రపంచ ఆర్థిక మాంద్యం సూచనలతో వణుకు పుట్టిస్తున్న బాబా వంగా జోస్యం

Baba Vanga Predictions 2026: 2008లో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం తలచుకుంటే ఇప్పటికీ జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. సాఫ్ట్‌వేర్‌ రంగం కుదేలైన వేళ విదేశాల్లో ఉన్నవారంతా స్వదేశాల బాట పట్టిన సంఘటనలు ఇప్పటికీ చర్చనీయాంశమే.. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి సంక్షోభం దిశగా పయనిస్తోందా అనే ప్రశ్న మళ్లీ బుగులు పట్టిస్తోంది. కొత్త ఏడాది 2026లో ఆర్థిక మాంద్యం మరోసారి ప్రపంచాన్ని తలకిందులు చేయబోతుందనే బాబా వంగా జోస్యం నిజం కాబోతుందా అనే సందేహాలు చర్చకు దారితీస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, అస్థిర చమురు ధరలు, ఏఐ కారణంగా భారీగా ఉద్యోగాల తొలగింపులు, ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి వాతావరణం నెలకొనడం.. ఇవన్నీ 2026లో మాంద్య సంకేతాలేనా అనే భయం నెలకొంది. ఈ అంశంపై ఆర్థిక వేత్తల ఆందోళనలే కాకుండా.. ప్రముఖ బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్‌ బాబా వంగా గతంలో చేసిన ఒక ప్రవచనం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. 

- Advertisement -

కరెన్సీ పడిపోతుందా.. 

2026లో ప్రపంచవ్యాప్తంగా నగదు కొరత(Cash Crush) చోటుచేసుకుంటుందని బాబా వంగా ముందుగానే చెప్పారని కథనం వెలువరించిందని మనీ కంట్రోల్‌ నివేదిక తెలిపింది. ఒక దశలో డిజిటల్ మనీ, హార్డ్ క్యాష్ రెండూ విఫలమయ్యే స్థితికి చేరవచ్చని.. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థల్లో అంతరాయాలు, కరెన్సీ విలువలు క్షీణించడం, మార్కెట్‌లో ద్రవ్యత తగ్గిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చని ఆమె ప్రవచనాలు పేర్కొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్యాష్‌ క్రష్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీయగా.. 2026లో నిజంగానే ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం నెలకొంటుందా.. డబ్బు విలువ పూర్తిగా తగ్గిపోతుందా? అనే సందేహాలు ప్రజల్లో నెలకొంటున్నాయి.

Also Read: https://teluguprabha.net/international-news/pakistan-afghanistan-ties-cut-border-tensions-tttp-strikes-oct2025/

మూడో ప్రపంచ యుద్ధం

కాగా, 2026లో 2026లో మూడో ప్రపంచ యుద్ధం సంభవించే అవకాశం కూడా ఉందని బాబా వంగా చేసిన అంచనాల ద్వారా తెలుస్తోంది. రష్యా, అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా మూడో ప్రపంచ యుద్ధం నెలకొంటుందని ఆమె ప్రవచనాలు చెబుతున్నాయని మనీకంట్రోల్ నివేదిక వెల్లడించింది. తైవాన్‌పై చైనా ఆధిపత్యం సాధించే ప్రయత్నాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడం, పశ్చిమ దేశాల మధ్య ఉన్న ఆర్థిక-సైనిక ఉద్రిక్తతలు బాబా వంగా గతంలో ఊహించినట్లుగానే జరగడం ఈ ఆందోళనలకు మరింత ఆద్యం పోస్తున్నాయి. 

ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌

ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌పై కూడా బాబా వంగా చేసిన ముఖ్యమైన ప్రవచనాల్లో ఒకటి. 2026 నాటికి మానవ వ్యవస్థలపై ఏఐ గణనీయమైన నియంత్రణను సాధిస్తుందని ఆమె ఊహించారు. టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొనగా.. గత రెండేళ్లలో చోటుచేసుకున్న మార్పులు దీనికి బలం చేకూరుస్తున్నాయి. అయితే ఏఐ  మానవ జీవితాన్ని సులభతరం చేయగలిగినా, ఆర్థిక అసమానతలను పెంచే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Also Read: https://teluguprabha.net/international-news/donald-trump-india-pakistan-war-claim-tariffs/

గ్రహాంతర జీవులతో సంపర్కం

వచ్చే ఏడాది నవంబర్‌లో భూమిపై మరో వింత చోటుచేసుకోబోతుందని బాబా వంగా చేసిన ప్రవచనాలు.. హార్వర్డ్ శాస్త్రవేత్త చేసిన పరిశోధనలకు సరిపోలుతున్నాయి. ఒక భారీ అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆమె ఊహించారు. భూమిపై గ్రహాంతర జీవులతో సంపర్కం జరిగే అవకాశం ఉందని చెప్పారు. కాగా, సెప్టెంబర్ 11 దాడులు, బ్రెగ్జిట్, 2004 సునామీ వంటి ఘటనల గురించి చేసిన బాబా వంగా చేసిన అంచనాలు కొంతవరకు నిజం కావడంతో 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం నెలకొంటుందా అనే ఆందోళన కలిగిస్తోంది. ఏది ఎంతవరకు నిజం అనేది కాలంతో పాటు మనమూ వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad