Thursday, July 4, 2024
Homeఇంటర్నేషనల్BAFTA 2023: బాప్టా అవార్డుల లిస్టులో RRR

BAFTA 2023: బాప్టా అవార్డుల లిస్టులో RRR

ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ గా దుమ్ములేపుతూనే ఉంది. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో సత్తా చాటుతున్న ఆర్ఆర్ఆర్ లేటెస్ట్ గా ప్రతిష్ఠాత్మక బాఫ్టా అవార్డుల జాబితాలో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్స్ నామినేషన్స్ లో ఉన్న ఆర్ఆర్ఆర్ ఇక బాఫ్టా లాంగ్ లిస్ట్ లోనూ చేరనుండటం విశేషం.

- Advertisement -

బ్రిటీష్ అకాడమీ ఫిలిం అవార్డ్స్ (BAFTA)24 కేటగెరీల్లో సినిమాలను ప్రకటించగా ఫిలిం నాట్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాంగ్ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ నిలిచింది. నామినేషన్స్ ఈనెల 19న జరుగనుండగా వచ్చే నెల 19న సౌత్ బ్యాంక్ సెంటర్స్ రాయల్ ఫెస్టివల్ హాల్ లో సాగనుంది. 274 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లు సాధించిన ఆర్ఆర్ఆర్ విదేశాల్లోనూ విజయవంతంగా స్క్రీన్ అయింది. రాం చరణ్, తారక్, డైరెక్టర్ రాజమౌళికి లెక్కలేనన్ని అవార్డులు, గుర్తింపులను తెచ్చిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ అన్ని రికార్డులు తిరగరాస్తుండటం హైలైట్. అవార్డుల పంట పండిస్తున్న ప్యాన్ ఇండియా సినిమాగా టాలీవుడ్ మకుటంలో కలికితురాయిలా ఆర్ఆర్ఆర్ నిలుస్తోంది.



సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News