పాపులర్ బ్లాగర్ ఎటిన్ బెర్నెత్ లేటెస్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వైరల్ అవుతోంది. అమెరికన్ బిజినెస్ టైకున్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇందులో చపాతీలు చేస్తూ, వాటిని ఎంజాయ్ చేసే వీడియో చాలా ఆసక్తిగా ఉంది. చెఫ్ గా మారిన బిల్ గేట్స్ పిండి కలపటం, చపాతీ తిక్కటం చూస్తుంటే నవ్వొస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తనకు వంట చేసే అలవాటు లేదని, కేవలం సూపులను వేడి చేసి అలవాటుందని వీడియోలో గేట్స్ వివరించారు.
- Advertisement -
బ్లాగర్ ఎయిటన్ బెర్నెత్ ఈ మధ్యనే ఇండియా వచ్చి, ఢిల్లీలోని గురుద్వారాలో రొట్టెలు చేయటాన్ని నేర్చుకున్నాడు. బిహార్ లో పర్యటించి, గోధుమ రైతులను కలుసుకుని దీదీ కి రసోయి క్యాంటీన్లలో రొట్టెల తయారీని ఔపోసన పట్టినట్టు బ్లాగర్ చెప్పుకొచ్చాడు.