Wednesday, December 4, 2024
Homeఇంటర్నేషనల్Alia Fakhri: మాజీ బాయ్‌ఫ్రెండ్‌ని దారుణంగా హత్య చేసిన హీరోయిన్ సోదరి

Alia Fakhri: మాజీ బాయ్‌ఫ్రెండ్‌ని దారుణంగా హత్య చేసిన హీరోయిన్ సోదరి

బాలీవుడ్‌ హీరోయిన్ నర్గీస్‌ ఫక్రీ(Nargis Fakhri) సోదరి అలియా ఫక్రీ తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను దారుణంగా హత్య చేశారు. నెల క్రితం జరిగిన ఈ హత్య తాజాగా వెలుగులోకి రావడంతో ఆమె అరెస్ట్ అయ్యారు. అసలు ఏం అయిందంటే న్యూయార్క్‌లో ఉంటున్న అలియా ఫక్రీ గతంలో ఎడ్వర్డ్‌ జాకోబ్‌ అనే యువకుడితో డేటింగ్‌లో ఉంది. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఏడాది క్రితం విడిపోయారు. అయితే ఈ బ్రేకప్ అలియాకు నచ్చలేదు. అనంతరం జాకోబ్‌కు అనాస్టాసియా ఎటినీ అనే యువతితో పరిచయమైంది. వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుసుకున్న అలియా పలుమార్లు బెదిరింపులకు పాల్పడింది.

- Advertisement -

ఈ క్రమంలోనే నవంబరు 2న జాకోబ్‌, ఆయన స్నేహితురాలు ఉంటున్న ఇంటికి నిప్పంటించింది. ఈ మంటల్లో చిక్కుకుని వారిద్దరూ సజీవ దహనమయ్యారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా అలియా ఫక్రీని అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమె దోషిగా తేలితే జీవితఖైదు పడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆమెను రిమాండ్‌కు తరలించారు. సోదరి అరెస్టుపై నర్గీస్‌ ఫక్రీ ఇంకా స్పందించలేదు. కాగా రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన రాక్‌స్టార్‌తో పరిచయమైన నర్గీస్‌.. కిక్‌, హౌస్‌ఫుల్‌ 3 వంటి చిత్రాల్లో అలరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News