Wednesday, March 12, 2025
Homeఇంటర్నేషనల్చైనాలో కొత్త బిజినెస్.. ఆ మట్టి ఇంట్లో ఉంటే అదృష్టమంట.. ఇదే పిచ్చిరా బాబు..!

చైనాలో కొత్త బిజినెస్.. ఆ మట్టి ఇంట్లో ఉంటే అదృష్టమంట.. ఇదే పిచ్చిరా బాబు..!

సాధారణంగా మూఢ నమ్మకాలు అనేవి తర్కానికి.. శాస్త్రీయ ఆధారాలకు విరుద్ధంగా ప్రజలలో ఉన్న కొన్ని అపోహలు. ఇవి ఎక్కువగా భయంతో, అనిశ్చితితో, లేదా కొన్ని సందర్భాల్లో సమాజ నియంత్రణ కోసం ప్రవేశపెట్టబడ్డాయి. ఇలాంటి నమ్మకాలు కేవలం మన దేశంలోనే ఉంటాయి అనుకుంటే పొరపాటే.. ఈ ప్రపంచంలో చాలా దేశాల్లోని కొన్ని నమ్మకాలు విచిత్రంగా అనిపిస్తాయి. వీటిలో కొన్ని విడ్డూరంగా ఉంటే మరికొన్ని హాస్యాస్పదంగా అనిపిస్తాయి. అలాంటి ఓ మూఢనమ్మకం చైనాలో కూడా ఉంది.

- Advertisement -

చైనాలో ఓ సరికొత్త ఆన్‌లైన్ ట్రెండ్ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ప్రధాన బ్యాంకుల ఆవరణలోని మట్టిని సేకరించి దాన్ని అమ్ముతున్నారు. ఆ మట్టి ఉంటే అదృష్టం, ఆర్థికంగా కలిసివస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. ఈ బ్యాంక్ మట్టి ధర సుమారు రూ.250 నుంచి రూ.10,200 మధ్య వరకు ఉంది. ఈ మట్టిని ఇంట్లో ఉంచుకుంటే ఆర్థికంగా లాభాలు పొందవచ్చని చాలా మంది నమ్ముతున్నారు. బ్యాంకుల ముందు మట్టిని తవ్వుతున్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. బ్యాంక్ లాబీల లోపల మొక్కల్లో వద్ద ఉండే మట్టిని, కౌంటింగ్ మిషన్ నుంచి వచ్చిన ధూళిని కూడా అమ్మకందారులు ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్నారు.

కొంత మంది వ్యాపారులైతే ఈ మట్టిని కొందరి నుంచి కొనుగోలు చేసి, తమ బిజినెస్ అభివృద్ధి కోసం వాడుతున్నారంట. అయితే ఇటువంటివి నమ్మకూడదని కూడా కొందరు అవగాహన కల్పిస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో మట్టి తవ్వడం చట్ట విరుద్ధమని న్యాయనిపుణులు అంటున్నారు. మట్టి అమ్ముతున్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ఈ మట్టి ఐదు ప్రధాన బ్యాంకుల వద్ద నుంచి చేతితో సేకరించామని చెబుతున్నారు.. దీనిని ఇంట్లో పెట్టుకుంటూ చెడు శక్తులను తొలగిస్తుందని కొందరు నమ్ముతారు. ఆర్థికంగానూ ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది భావిస్తున్నారని తెలిపారు. ఏది ఏమైనా ఈ నమ్మకం అక్కడ కొత్త బిజినెస్ కు కారణమైంది. చాలా మంది మట్టిని కొనుగోలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News