Donald trump announces 25% tariff on India: భారత్ పై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టుగా అమెరిగా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలు అమలు చేయబోతున్నారు. దీనిపై ట్రంప్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా చెప్పారు. గతంలో ఇతర దేశాలపై సైతం కీలక ఆర్థిక నిర్ణయాలను ట్రంప్ తీసుకున్నారు. ఆయా దేశాలపై భారీ సుంకాలను విధిస్తూ, ప్రపంచ వాణిజ్యంలో కొరకరాని కొయ్యగా మారాడు. ఇదే కోవాలో భారత్‌ను కూడా ఈ జాబితాలో చేర్చేశాడు. మిత్రదేశం అనుకుంటూనే సుంకాలు భారీగా పెంచేశాడు. భారత్‌పై 25 శాతం దిగుమతి సుంకాలు అమలు చేయనున్నట్టు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేశాడు.
అతను చేసిన ట్వీట్ ‘ఇండియా మాకు మిత్రదేశం అయినప్పటికీ, వారితో మేము మనం స్వల్ప స్థాయిలోనే బిజినెస్ కొనసాగిస్తున్నాం. ఇందుకు కారణం భారత్ విధించే సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. అదే విధంగా వారు విదేశీ వాణిజ్యాన్ని నియంత్రించేందుకు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన నిర్ణయాలను అమలు చేస్తున్నారు. భారత్ రక్షణ పరికరాలను ఎక్కువగా రష్యా నుంచే మాత్రమే కొనుగోళ్లు చేస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న దాడులను ఆపాలని ప్రపంచం ఆశిస్తున్న సందర్భంగా భారత్ చైనా సరసన నిలిచి రష్యా ఉత్పత్తులకు అతిపెద్ద కొనుగోలుదారులలో మారింది. దీని వల్ల, భారతదేశం అమెరికాకు ఆగస్టు 1 నుంచి 25 శాతం సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది” అని ట్వీట్ చేశాడు.


