అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ భవనంలో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో తీసుకున్న 78 నిర్ణయాలను రద్దు చేస్తూ ట్రంప్ తొలి సంతకం చేశారు. యూఎస్ క్యాపిటల్‌పై దాడి చేసిన 1500 మంది తన మద్దతుదారులకు ఉపశమనం కల్పించారు. ఈమేరకు ఆయన ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WOH) సభ్యత్వం నుంచి వైదొలుగుతూ మరో సంతకం చేశారు.
తొలిరోజు ట్రంప్ సంతకం చేసిన మరికొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు..
** మెక్సికో అక్రమ వలసలు అడ్డుకునేలా అమెరికా దక్షిణ సరిహద్దుల్లో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటన.
** పారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు సంతకం
** టిక్ టాక్ నిషేధాన్ని 75రోజుల పాటు నిలిపివేస్తూ సంతకం చేశారు.
** పాలనపై పట్టుసాధించే వరకు అధికారులు కొత్తగా ఎలాంటి నియంత్రణలు విధించే అవకాశం లేకుండా సంతకం చేశారు.
** ప్రభుత్వ ఉధ్యోగులు కచ్చితంగా కార్యాలయాలకు వచ్చి విధుల్లో హాజరు కావాలని ఆదేశాలు.