Monday, November 17, 2025
Homeఇంటర్నేషనల్Donald Trump: భారత్‌కు షాక్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్

Donald Trump: భారత్‌కు షాక్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సెషన్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. జనవరి 20న బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత ఆరు వారాల్లో 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశానని తెలిపారు. గత బైడెన్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని విధానాలు దేశానికి ప్రయోజనకరం కాదన్నారు. గత ప్రభుత్వం నాలుగేళ్లలో చేయలేని పనిని తమ ప్రభుత్వం 43 రోజుల్లోనే చేసి చూపించిందని చెప్పారు. దశాబ్దాలుగా ఇతర దేశాలు అమెరికాపై సుంకాలను విధిస్తున్నాయని ట్రంప్ మండిపడ్డారు. అదే తరహాలో ఆ దేశాలపైనా ప్రతీకార సుంకాన్ని విధించడం బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

యూరోపియన్ యూనియన్, భారత్, చైనా, బ్రెజిల్, మెక్సికో, కెనడా దక్షిణ కొరియా దేశాలు అమెరికాపై చాలా ఎక్కువ సుంకాలు విధిస్తున్నాయని తెలిపారు. భారత్ అమెరికాపై 100శాతానికిపైగా ఆటో టారిఫ్‌లు విధిస్తుందని చెప్పుకొచ్చారు. ఇక అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై చైనా, దక్షిణ కొరియా దేశాలు సుంకాలు ఎక్కువగా వసూలు చేస్తున్నాయన్నారు. అమెరికా స్నేహితులు, శత్రువులు ఇలానే చేస్తున్నారని.. అందుకే ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. ఏ దేశానికీ లేని విధంగా మన కాళ్ల కింద చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని.. ఇది ద్రవ్యోల్బణ సమస్యను తీరుస్తుందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad