అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి గోల్డ్ కార్డు(Gold Card) ఇస్తామని.. 5 మిలియన్ డాలర్లతో వస్తే పౌరసత్వాన్ని ఇస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన గోల్డ్ కార్డు వీసా లుక్‌ను ట్రంప్ విడుదల చేశారు. ఈ కార్డుపై ట్రంప్ ఫొటో ఉంది. రెండు వారాల్లోపు కార్డ్ అందుబాటులోకి వస్తుందని ట్రంప్ తెలిపారు.
గోల్డ్ కార్డును 5 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఎవరైనా సొంతం చేసుకోవచ్చని ట్రంప్ తెలిపారు. రూ.43.5 కోట్లు (50 లక్షల డాలర్లు) వెచ్చించేవారికి ఈ గోల్డ్ కార్డు అందిస్తామని వెల్లడించారు. ఈ కార్డు కలిగి ఉన్నవారు అమెరికా పౌరసత్వాన్ని అందుకుంటారు. కాగా అమెరికాలో పెట్టుబడిదారుల కోసం 35ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈబీ-5 వీసా పాలసీని ట్రంప్ రద్దు చేశారు. దాని స్థానంలో గోల్డ్ కార్డు వీసాను అందుబాటులోకి తెచ్చారు.