Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Elon Musk: భారతదేశం ఎన్నికల ప్రక్రియపై మస్క్ ప్రశంసలు

Elon Musk: భారతదేశం ఎన్నికల ప్రక్రియపై మస్క్ ప్రశంసలు

Elon Musk| భారతదేశం ఎన్నికల ప్రక్రియపై ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌(Elon Musk) ప్రశంసలు కురిపించారు. అమెరికాలోని కాలిఫోర్నియా(California)లో ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తికాకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ‘భారతదేశంలో ఒక్క రోజులోనే 640 మిలియన్ల ఓట్లను ఎలా లెక్కించారు..?’ అనే హెడ్‌లైన్‌తో ప్రచురితమైన ఓ వార్త కథన్నాన్ని షేర్‌ చేశారు. ‘భారత్‌ ఒక్క రోజులోనే ఇన్ని ఓట్లను లెక్కించింది. కానీ, కాలిఫోర్నియా ఇంకా ఓట్ల లెక్కింపులోనే ఉంది’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో మస్క్ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

- Advertisement -

కాగా ఈనెల 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఘన విజయం సాధించారు. అయితే కాలిఫోర్నియాలో ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తికాకపోవడం గమనార్హం. అమెరికాలోని అత్యధిక జనాభా కలిగిన కాలిఫోర్నియా రాష్ట్రంలో మెయిల్‌ ద్వారా ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. దీంతో అవి లెక్కించేందుకు ఎక్కువ సమయం పడుతోంది. ఇప్పటికే 98 శాతం కౌంటింగ్‌ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad