ప్యాంట్స్ విప్పాల్సిందే.. అండర్ పాస్ లో నడిచి వెళ్లాలంటే ఇది తప్పదు.. లండన్ లో కనిపించిన సీన్ ఇది. 12వ వార్షిక నో ట్రౌజర్స్ డే ట్యూబ్ రైడ్ సందర్భంగా లండన్ ప్రయాణికులంతా ఇలా ప్యాంట్లు విప్పేసి ప్రయాణించారు. ద స్టిఫ్ అప్పర్ లిప్ సొసైటీ ఈ ఈవెంట్ ను నిర్వహించింది. నో ప్యాంట్స్ సబ్ వే రైడ్ లో భాగంగా ఈ విచిత్రమైన ఈవెంట్ ఏటా జరుగుతోంది. నిజానికి ఇది గ్లోబల్ ఈవెంట్. 2002లో న్యూయార్క్ లో ఇది స్టార్ట్ అయింది. ఇలాంటి వెరైటీ ఈవెంట్ ను ఏటా ప్రపంచంలో చాలా దేశాల్లో ఫాలో అవుతున్నారు. జస్ట్ అండర్ వేర్ తో ట్రావెల్ చేయటం ఇందులో ఉన్న ఫన్ అంతే. అయితే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేవారు తాము ప్యాంట్ వేసుకోవటం మర్చిపోయినట్టు చాలా సహజంగా నడుచుకుంటూ వెళ్లిపోవాలంతే. చాలా రొటీన్ గా ప్రయాణికులంతా ప్యాంట్, స్కర్ట్ వేసుకున్నట్టే తమ పని చేసుకుంటూ పోయేలా ఉండే ఈవెంట్ గా ఇది పాపులర్ అయింది.
Event: తప్పింది కాదు..నో ట్రౌజర్స్ డే మరి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES