Thursday, April 3, 2025
Homeఇంటర్నేషనల్Forbes Billionaires List: ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితాలో భారతీయులు వీరే

Forbes Billionaires List: ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితాలో భారతీయులు వీరే

ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితా 2025(Forbes Billionaires List) విడుదలైంది. గ‌తేడాది బిలియనీర్ల సంఖ్యతో పోలిస్తే ఈసారి 247 మంది ఎక్కువగా ఉన్నారని తెలిపింది. ఈ ఏడాది బిలియనీర్ల సంఖ్య 3,028కి చేరిందని ఫోర్బ్స్‌ వెల్లడించింది. ప్ర‌పంచ‌ బిలియనీర్ల సమష్టి సంపద 16.1 ట్రిలియన్ డాల‌ర్లుగా పేర్కొంది. ఈ జాబితాలో స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ 342 బిలియన్‌ డాలర్ల నికర విలువతో మరోసారి త‌న అగ్ర‌స్థానాన్ని ప‌దిలం చేసుకున్నారు. ఇక ర్యాంకింగ్స్‌లో అమెరికా 902 బిలియనీర్లతో టాప్‌లో ఉండగా…చైనా (516), ఇండియా (205) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

- Advertisement -

టాప్‌-10 ప్ర‌పంచ బిలియ‌నీర్లు వీరే…

ఎలాన్ మస్క్ (342 బిలియన్ డాల‌ర్లు) – టెస్లా, స్పేస్‌ఎక్స్ (అమెరికా)
మార్క్ జుకర్‌బర్గ్ (216 బిలియన్ డాల‌ర్లు) – మెటా (అమెరికా)
జెఫ్ బెజోస్ (215 బిలియన్ డాల‌ర్లు) – అమెజాన్ (అమెరికా)
లారీ ఎల్లిసన్ (192 బిలియన్ డాల‌ర్లు) – ఒరాకిల్ (అమెరికా)
బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ (178 బిలియన్ డాల‌ర్లు) – LVMH‌ (ఫ్రాన్స్)
వారెన్ బఫెట్ (154 బిలియన్ డాల‌ర్లు) – బెర్క్‌షైర్ హాత్వే (అమెరికా)
లారీ పేజ్ (144 బిలియన్ డాల‌ర్లు) – గూగుల్ (అమెరికా)
సెర్గీ బ్రిన్ (138 బిలియన్ డాల‌ర్లు) – గూగుల్ (అమెరికా)
అమాన్సియో ఒర్టెగా (124 బిలియన్ డాల‌ర్లు) – జారా (స్పెయిన్)
స్టీవ్ బాల్మెర్ (118 బిలియన్ డాల‌ర్లు) – మైక్రోసాఫ్ట్ (అమెరికా)

అత్యంత ధనవంతులైన టాప్ 10 భారతీయులు వీరే..

ముఖేశ్‌ అంబానీ- (92.5 బిలియన్ డాల‌ర్లు)
గౌతమ్ అదానీ- (56.3 బిలియన్ డాల‌ర్లు)
జిందాల్ అండ్ ఫ్యామిలీ- (35.5 బిలియన్ డాల‌ర్లు)
శివ నాడార్- (34.5 బిలియన్ డాల‌ర్లు)
దిలీప్ సంఘ్వీ- (24.9 బిలియన్ డాల‌ర్లు)
సైరస్ పూనావాలా- (23.1 బిలియన్ డాల‌ర్లు)
కుమార్ బిర్లా – (20.9 బిలియన్ డాల‌ర్లు)
లక్ష్మీ మిట్టల్- (19.2 బిలియన్ డాల‌ర్లు)
రాధాకిషన్ దమాని- (15.4 బిలియన్ డాల‌ర్లు)
కుశాల్ పాల్ సింగ్- (14.5 బిలియన్ డాల‌ర్లు)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News