H1B Visa Fee Hike : అమెరికాలో H-1B వీసా ఫీజు పెంపు ప్రతిపాదన భారత వైద్యుల్లో తీవ్ర ఆందోళన సృష్టించింది. సెప్టెంబర్ 19, 2025న ట్రంప్ ప్రభుత్వం కొత్త దరఖాస్తులకు ఫీజును $100,000 (సుమారు రూ.83 లక్షలు)కు పెంచాలని ప్రతిపాదించింది. ఇది నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు (స్కిల్డ్ వర్కర్స్) వర్తిస్తుంది. అమెరికాలో 25% వలస వైద్యులు భారతీయులే. వీరిలో 50,000 మంది H1B వీసాలపై గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. ఈ పెంపు వారి భవిష్యత్తును ముప్పుగా మారుస్తుందని వైద్య సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
ALSO READ: Lokesh Kanagaraj: లోకేష్‌కి షాకిచ్చిన రజినీకాంత్.. యూనివర్స్‌లోకి అడుగుపెట్టిన స్టార్ డైరెక్టర్
అర్కాన్సాస్‌లోని చిన్న పట్టణం బేట్స్‌విల్లేలో డాక్టర్ మహేశ్ అనంత (మద్రాస్ మెడికల్ కాలేజీ గోల్డ్ మెడలిస్ట్) ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. చుట్టుపక్కల వందల మైళ్లకు మరో ఆసుపత్రి లేకపోవడంతో స్థానికులు ఆయనపై ఆధారపడతారు. “ప్రజలు చిన్న సమస్యలకు కూడా మమ్మల్ని చూస్తారు. ఇక్కడ మేమే వారి ఆశ్రయం” అని అనంత చెప్పారు. అలాంటి వైద్యులు గ్రీన్ కార్డు కోసం ఏళ్లు ఎదురుచూస్తుంటారు. ఈ ఫీజు పెంపు గ్రామీణ ఆసుపత్రులను మూసివేయవచ్చని భయం ఏర్పుడుతుంది.
అమెరికాలో వలస వైద్యులు 25% ఉన్నారు. వీరిలో 64% గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. అమెరికన్ గ్రాడ్యుయేట్లు ఇక్కడ పనిచేయడానికి ఇష్టపడరు. 2034 నాటికి 1.24 లక్షల వైద్యుల కొరత ఏర్పడుతుందని అంచనా. AMA అధ్యక్షుడు డాక్టర్ బాబీ ముక్కామల (భారత సంతతి) “గ్రామీణ ఆసుపత్రులు మూసివేస్తాయి” అని ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం “హ్యూమానిటేరియన్ కాన్సిక్వెన్సెస్” ఉంటాయని వ్యతిరేకించింది.
ప్రతిపాదనపై వ్యతిరేకత ఎక్కువైంది. వైట్‌హౌస్ “వైద్యులు, రెసిడెంట్లకు మినహాయింపు ఇవ్వవచ్చు” అని స్పష్టం చేసింది. ప్రస్తుత H1B వీసాలకు ఫీజు పెంపు వర్తించదు. కానీ, కొత్త దరఖాస్తులకు $100,000 చెల్లించాలి. ఇది భారతీయ వైద్యుల రాకను 50% తగ్గిస్తుందని వైద్య సంఘాలు అంచనా. ఆలబామాలోని డాక్టర్ రాకేశ్ కనిపాకం వంటి వైద్యులు వారానికి వందల మైళ్లు ప్రయాణించి కిడ్నీ రోగులకు సేవలందిస్తున్నారు. “ఇలాంటి పెంపు మా సేవలు ఆగిపోతాయి” అని ఆయన చెప్పారు.
ఈ ప్రతిపాదన AMA, భారత డాక్టర్ల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. “వైద్యులకు పూర్తి మినహాయింపు ఇవ్వాలి, లేకపోతే గ్రామీణ ఆరోగ్య సంక్షణ క్షీణిస్తుంది” అని డిమాండ్ వినిపిస్తుంది. భారత ప్రభుత్వం కూడా డిప్లొమటిక్ చర్చలు చేస్తోంది. 2025లో H1B లాటరీలో 85,000 వీసాలు, వీటిలో 70% భారతీయులే. ఈ పెంపు వారి మీద పెద్ద భారంగా మారనుంది. వైద్యులు “మా సేవలు ఆగిపోతే గ్రామీణ ప్రజలు బాధపడతారు” అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


