Tuesday, May 21, 2024
Homeఇంటర్నేషనల్Earthquakes : వరుస భూకంపాలతో వణికిపోయిన ఇండోనేషియా.. బతుకులు శిథిలం

Earthquakes : వరుస భూకంపాలతో వణికిపోయిన ఇండోనేషియా.. బతుకులు శిథిలం

సోమవారం (నవంబర్ 21) మధ్యాహ్నం నుండి 10 గంటల వ్యవధిలో సంభవించిన వరుస భూకంపాల ధాటికి ఇండోనేషియా వణికిపోయింది. 10 గంటల సమయంలో 62 సార్లు కంపించిన భూమి.. ఆ దేశ ప్రజలకు తీరని నష్టాన్ని, శోకాన్ని మిగిల్చింది. జనజీవనం అస్థవ్యస్థమైంది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జావాలోని సియాంజుర్ నగరం కేంద్రంగా భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో 15 సెకన్ల పాటు భూమి కంపించడంతో జావా ద్వీపం వణికిపోయింది. రాత్రి 9.16 గంటల ప్రాంతంలో పాపువా దీవుల్లో 5.1 తీవ్రతతో సంభవించిన భూకంపం జనావాసాలను నేలమట్టం చేసింది. వందల సంఖ్యలో ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి.

- Advertisement -

వరుస భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 162కి పెరిగింది. 700 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. ఇళ్లు, అపార్ట్ మెంట్లతో పాటు, స్కూళ్లు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థనా మందిరాలు సైతం దెబ్బతిన్నాయి. బాధితులకు చికిత్స చేసేందుకు ఆస్పత్రులు లేకపోవడంతో.. నడిరోడ్డుపైనే చికిత్స అందిస్తున్నారు. సాయంత్రం వరకు ఈ ప్రాంతంలో 1.5 నుంచి 4.8 తీవ్రతతో పలుమార్లు కంపించింది. నేలమట్టమైన భవనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకుని ఉంటారని అక్కడి అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నవంబర్ 18న బెంగ్ కులు నగరానికి 203 కిలోమీటర్ల దూరంలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. కాగా.. ఇప్పటి వరకూ అక్కడి అధికారులు సునామీ హెచ్చరికలేవీ జారీ చేయలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News