Saturday, November 15, 2025
HomeTop StoriesShehbaz Sharif: పాక్ ప్రధాని సుద్దపూస మాటలు.. వింటే షాక్ అవ్వాల్సిందే..!

Shehbaz Sharif: పాక్ ప్రధాని సుద్దపూస మాటలు.. వింటే షాక్ అవ్వాల్సిందే..!

Shehbaz Sharif: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇప్పుడు ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వస్తే భగ్గుమనే పరిస్ధితులు నెలకున్నాయి. అయినా అంతర్జాతీయ క్రికెట్ నిబంధనల మేరకు పాకిస్థాన్ తో భారత్ ఆసియాకప్ మ్యాచ్ లు ఆడుతోంది. ఇలాంటి సమయంలో భారత్-పాకిస్థాన్ మధ్య శాంతి నెలకొనడంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. అంతేకాకుండా, కశ్మీర్‌ అంశంపై మరోసారి విషం చిమ్మారు. కశ్మీర్ సమస్య పరిష్కారమైతేనే భారత్- పాక్ మధ్య సాధారణ సంబంధాలు ఏర్పడతాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించకుండానే ఇరుదేశాల మధ్య సఖ్యత కుదురుతుందని ఎవరైనా విశ్వసిస్తున్నారంటే.. వారు భ్రమలో జీవిస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు. లండన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు అవాకులు చవాకులు పేలారు. ప్రాంతీయంగా శాంతిని నెలకొల్పేందుకు భారత్‌ ఎలాంటి ప్రయత్నం చేయట్లేదని పేర్కొన్నారు. కశ్మీరీల రక్తం వృథా కాదన్నారు.

- Advertisement -

Read also: Bigg Boss Captain: మళ్లీ కెప్టెన్ గా డీమాన్.. ఈసారి మాత్రం ఫెయిర్ గానే గెలిచాడంటరోయ్..

‘‘భారత్‌- పాకిస్థాన్‌ (Pakistan) పొరుగు దేశాలు. అ కలిసి ఉండటం నేర్చుకోవాలి. అయితే, కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం లభించనంత వరకు సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోలేవు. కశ్మీరీ ప్రజల త్యాగాలను వృథా కానివ్వం. భారత్‌ సహకారం అందించే బదులు.. పోరాట ధోరణిని అవలంబిస్తోంది. పహల్గాం ఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక అంతర్జాతీయ కమిటీని ఏర్పాటు చేయాలని కోరాం. శాంతియుతంగా జీవించాలా? లేదా పోరాటం కొనసాగించాలా అనేది మన చేతుల్లోనే ఉంది’’ అని షరీఫ్‌ నోరుజారారు. భారతదేశం మంచి పొరుగు దేశంగా ఉండటానికి బదులుగా పోరాట విధానం అవలంబిస్తోందని షరీఫ్ ఆరోపించారు. మనం ఒకరినొకరు ప్రేమించుకోవడం, గౌరవించడం ద్వారా జీవించాలనేది తమ కోరికన్నారు. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తో దిగజారిన సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు షరీఫ్ ప్రయత్నిస్తున్నారు.

Read also: Bigg Boss latest Promo: మూల పురుషుడిలా కూర్చోకు.. హరీష్ పై నాగ్ సెటైర్

భారత్ తో యుద్ధాల గురించి

అంతేకాకుండా, భారత్ తో యుద్ధాల గురించి కూడా షరీఫ్ మాట్లాడారు. ‘‘భారత్‌తో నాలుగు యుద్ధాలు చేశాం. దీనికి బిలియన్ల డాలర్లు ఖర్చయ్యాయి. ఆ నిధులను పాక్‌ ప్రజల అభివృద్ధికి ఉపయోగించాల్సింది’’ అని వ్యాఖ్యానించారు. .. అలాగే కాశ్మీర్ సమస్యను, గాజా యుద్ధాన్ని ఆయన పోల్చారు. ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ.. గాజాలో 65 వేల మందికిపైగా ప్రజలు ప్రాణత్యాగం చేశారన్నారు. ఇజ్రాయెల్ దురాగతాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఇదిలా ఉండగా.. ఉగ్రవాదంపై చర్యలు తీసుకునేవరకు పాకిస్థాన్‌తో చర్చల ప్రసక్తే లేదని భారత్‌ పలు సందర్భాల్లో స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad