జ్యూరిచ్ ఎయిర్ పోర్టులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందానికి ఘనస్వాగతం లభించింది. తెలంగాణలో కొత్త సర్కారు ఏర్పడటంతో స్విట్జర్లాండ్ లోని తెలుగువారిలో సరికొత్త ఉత్సాహం వచ్చిందని రేవంత్ పేర్కొన్నారు. దావోస్ లో జరుగనున్న వల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొనేందుకు తెలంగాణ సర్కారు ఆధ్వర్యంలో స్వయంగా ముఖ్యమంత్రి హాజరవుతుండటం తొలిసారి కావటంతో అందరి చూపు ఈ సమావేశాలపైనే పడింది. సీఎం రేవంత్ తో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి ప్రభుత్వ బృందం దావోస్ సమిట్ లో పెట్టుబడులను ఆకట్టుకునేందుకు పలు సంస్థలతో వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకునేందుకు సర్వసిద్ధంగా వెళ్లారు. ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అనే సరికొత్త నినాదంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసినట్టు సీఎం రేవంత్ సగర్వంగా వెల్లడించారు.
Invest in Telangana: ‘ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ’ సీఎం రేవంత్ నినాదం
దావోస్ వల్డ్ ఎకనామిక్ ఫోరం భేటీలో నయా స్లోగన్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES