Thursday, November 21, 2024
Homeఇంటర్నేషనల్JD Vance | అమెరికా ఉపాధ్యక్షుడు ఆంధ్రా అల్లుడే…

JD Vance | అమెరికా ఉపాధ్యక్షుడు ఆంధ్రా అల్లుడే…

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న అమెరికాలో మ్యాజిక్ ఫిగర్ 270 ఓట్లు. రిపబ్లిక్ అని పార్టీ మెజారిటీ మార్క్ లీడ్ ను దాటేసింది. దీంతో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠం మీద కూర్చోన్నారు. ఉపాధ్యక్షుడిగా జెడి వాన్స్ (JD Vance) బాధ్యతలు తీసుకోనున్నారు. క్రిందటి టర్మ్ లో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ కాగా.. ఈసారి ఆంధ్రప్రదేశ్ అల్లుడు వైస్ ప్రెసిడెంట్ అవడం విశేషం.

- Advertisement -

జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి తెలుగు మూలలున్న మహిళ. దీంతో ఆంధ్రాలో, ముఖ్యంగా ఉషా చిలుకూరి స్వగ్రామంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉషా పూర్వీకులు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామానికి చెందినవారు. విశాఖలోనూ వీరికి బంధువులున్నారు. ఉషా కుటుంబీకులు మంచి విద్యావంతులు. ఉషాకి నాన్నమ్మ వరసయ్యే శాంతమ్మ ఆంధ్రా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్. ఈ విషయం తెలిసి మీడియా ఆమెతో ఇంటర్వ్యూలు కూడా చేసింది. శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి తమ్ముడు రామశాస్త్రి. ఈయన ఐఐటీ ప్రొఫెసర్. రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ, లక్ష్మి దంపతుల సంతానమే ఉషా చిలుకూరి. 1970 లో రాధాక్రిష్ణ అమెరికాకి షిఫ్ట్ అయ్యి అక్కడే సెటిల్ అయ్యారు. వీరి సంతానమే ఉషా చిలుకూరి. ఇప్పుడు ఆమె భర్త జెడి వాన్స్ (JD Vance) అగ్ర రాజ్యానికి ఉపాధ్యక్షుడు కావడంతో భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు సంతోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News