ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ చేసిన తాజా సర్వేలో ఈమేరకు 78శాతం ఓట్లను మోడీ గెలవటం హైలైట్. యూఎస్ ప్రెసిడెంట్ జో బైడన్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుఎల్ మాక్రన్, యూకే ప్రైమ్ మినిస్టర్ రిషి సనాక్ తో పాటు 22 మంది ప్రపంచ దేశాధినేతలు ఈ జాబితాలో ఉండగా వారందరిని తోసిరాజని మోడీ తొలి స్థానం సంపాదించారు. ద గ్లోబల్ లీడర్ అప్రూవల్ సర్వేను జనవరి 26-31 మధ్య కాలంలో సేకరించినట్టు సంస్థ వివరించింది.
ఈ సర్వేలో మోడీకి 78శాతం అప్రూవల్ రాగా, జో బైడన్ కు కేవలం 40శాతం ఓట్లే వచ్చాయి. కాగా మెక్సికన్ ప్రెసిడెంట్ ఆడ్రెస్ మాన్యుఎల్ లోపెజ్ అబ్రాడర్ 68 శాతం ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. ఆతరువాత 3వ స్థానం స్విస్ ప్రెసిడెంట్ కు దక్కింది.