Wednesday, March 19, 2025
Homeఇంటర్నేషనల్Astronauts: ఆ సమస్యలతో బాధ పడుతున్న సునీత విలియమ్స్.. గుండెకు రిస్క్..?

Astronauts: ఆ సమస్యలతో బాధ పడుతున్న సునీత విలియమ్స్.. గుండెకు రిస్క్..?

తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)లో చిక్కుకున్న నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ ‘బుచ్’ విల్మోర్ సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. ఎనిమిది రోజుల పాటు అంతరిక్షంలో గడిపి తిరిగి రావాల్సిన వారు.. అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే చిక్కుకున్నారు. బుధవారం ఉదయం 3:27 గంటలకు స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్‌లో ఫ్లోరిడా తీరానికి చేరుకున్నారు.

- Advertisement -

అయితే అంతరిక్షంలో ఇంతకాలం ఉన్న సునీతా విలియమ్స్ కి.. భూమి మీద జీవితానికి అలవాటు పడటం అంత తేలిక కాదు. వారి శరీరాలు మళ్లీ భూమి గురుత్వాకర్షణ శక్తికి అలవాటు పడాల్సి ఉంటుంది. దీని కోసం వారికి హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌లో 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో వారు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు చాలానే ఉన్నాయని తెలుస్తోంది.

అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపినందున వారి కళ్లపై ప్రభావం పడుతుంది. చూపు మందగించే అవకాశం ఉంది. అంతేకాదు, నడవడంలో ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. ఎందుకంటే, అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో వారి కాళ్ళు, పాదాలు పనిచేయవు. దీంతో పాదాలు చాలా సున్నితంగా మారి నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు, కండరాలు మరియు ఎముకలు కూడా బలహీనపడతాయి. ఎముకలు బలహీనపడటం వల్ల త్వరగా విరిగిపోయే ప్రమాదం ఉంది. అంతరిక్షంలో నాలుక కూడా బరువు లేని విధంగా ఉండటం వల్ల తిరిగి వచ్చిన తర్వాత సరిగ్గా మాట్లాడటానికి కొంత సమయం పడుతుంది.

ఇక గుండె కూడా బలహీనపడి, ఆకారంలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల తల తిరగడం, మూర్ఛ వంటి సమస్యలు రావొచ్చు. వీటన్నిటికీ మించి మానసికంగా కూడా వారు చాలా ఒత్తిడికి గురవుతారంట. చాలా కాలం ఒంటరిగా గడిపిన తర్వాత మళ్లీ సమాజంలో కలిసిపోవడం, సాధారణ జీవితానికి అలవాటు పడటం కష్టమవుతుంది. ఇక అంతరిక్షం నుండి తిరిగి వచ్చిన తర్వాత వారి రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. కాబట్టి, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని వ్యోమగాములకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News