ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ(PM Modi) పారిస్‌లో జరుగుతున్న AI యాక్షన్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో మోదీ మాట్లాడుతూ ఏఐ విషయంలో ప్రపంచం అంతా కలిసి ముందుకు వెళ్లాలన్నారు. ఏఐ టెక్నాలజీతో అన్ని రంగాల్లో మార్పులు వచ్చే మాట నిజమే కానీ ఉద్యోగాలు పోతాయనేది వదంతి మాత్రమే అని స్పష్టం చేశారు. ఉద్యోగులు ఎప్పటికప్పుడు స్కిల్స్ పెంచుకుంటూ ముందుకు వెళితే ఉన్నత అవకాశాలు వస్తాయని తెలిపారు. ఏఐతో వచ్చే అద్భుత ఆవిష్కరణలపై మాత్రమే కాకుండా ప్రమాదాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చడానికి పక్షపాతం లేని నాణ్యమైన డేటాసెట్‌లను అభివృద్ధి చేయాలని తెలిపారు. సైబర్ భద్రత, తప్పుడు సమాచారం , డీప్ ఫేక్‌కి సంబంధించిన ఆందోళనల్ని పరిష్కరించాలని కోరారు. రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ ఆర్థిక వ్యవస్థలను సమూలంగా మార్చేస్తుందని.. ఈ శతాబ్దంలో మానవాళి గొప్ప ఆవిష్కరణ ఏఐ అన్నారు. ఈ టెక్నాలజీని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకు రావాలని పలు దేశాల అధినేతలకు, టెక్ రంగ నిపుణులకు మోదీ పిలుపునిచ్చారు.