Sunday, October 6, 2024
Homeఇంటర్నేషనల్Prince: కాలర్ పట్టుకుని అన్న విలియమ్స్ నన్ను నేలపైకేసి కొట్టాడు:ప్రిన్స్ హ్యారీ ఆటోబయగ్రఫీ

Prince: కాలర్ పట్టుకుని అన్న విలియమ్స్ నన్ను నేలపైకేసి కొట్టాడు:ప్రిన్స్ హ్యారీ ఆటోబయగ్రఫీ

“మా అన్న నాపై దాడి చేశాడు.. కాలర్ పట్టుకుని విలియమ్స్ నన్నునేలకేసి కొడితే పోయి నేను కుక్క అన్నం తినే గిన్నెపై పడ్డా..ఆ గిన్నె ముక్కలైంది..నా వెన్నెముకలో గుచ్చుకుంటే.. నాకు పెద్ద గాయమే అయ్యింది”..ఇలా ఇంటి గుట్టును ప్రిన్స్ హ్యారీ రట్టు చేస్తున్నారు తన తాజా పుస్తకంలో. ప్రిన్స్ హ్యారీ తన అన్న ప్రిన్స్ విలియమ్స్ పై చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. తన ఆటోబయోగ్రఫీని ‘స్పేర్’ పేరుతో ప్రిన్స్ హ్యారీ రిలీజ్ చేయకముందే ఈ పుస్తకం సెన్సేషన్ సృష్టిస్తోంది. జనవరి 10వ తేదీన ‘స్పేర్’ రిలీజ్ కానుంది. ఇంకా ఈ పుస్తకంలో బకింగ్ హామ్ ప్యాలెస్ లో జరిగిన మాటల యుద్ధం, ఆఖరుకి ప్రిన్స్ హ్యారీపై విలియమ్స్ దాడి చేసిన విషయాలు సవివరంగా ఉన్నాయి. మెఘన్ అంటే ఏమాత్రం సదభిప్రాయం లేని విలియమ్స్ ఒకరోజు ఆమెపై కోపంతో ఊగిపోయారు. ఉన్నట్టుండి ప్రిన్స్ హ్యారీ కాలర్ పట్టుకుని, మెడను పట్టుకుని నేలపైకేసి కొట్టాడని హ్యారీ పుస్తకంలో చెప్పుకొచ్చారని గార్డియన్ పత్రిక చెబుతోంది. ఈ దాడిలో తన వీపుకు గాయాలు కూడా అయ్యాయని హ్యారీ పుస్తకంలో వివరించారు.

- Advertisement -

ప్రిన్స్ విలియమ్ హాలీవుడ్ నటి మెఘన్ మర్కెల్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. మెఘన్ కారణంగా రాజకుటుంబంలో చాలా గొడవలు పుట్టుకొచ్చాయి. ఇటు అన్నదమ్ముళ్లకు, అటు తోడి కోడళ్లకు ఏమాత్రం పడక చివరికి రాజరికం నుంచి బయటపడి సామాన్య పౌరుల్లా బతికేందుకు హ్యారి, మెఘన్ అమెరికాలోని క్యాలిఫోర్నియా వెళ్లిపోయారు. ఓప్రా విన్ఫ్రే ఇంటర్వ్యూ, నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీల్లో ఇప్పటికే మెఘన్, హ్యారీ ఇలాంటి ఫ్యామిలీ గొడవలు చాలా చెప్పగా తాజాగా ‘స్పేర్’ ద్వారా మరిన్ని రాజకుటుంబ గొడవలు రచ్చకెక్కనున్నాయన్నమాట.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News