Racist Comments In America: అమెరికాలో ఉన్నత చదువులు చదువుకోవాలి. అమెరికాలో మంచి ఉద్యోగం సాధించాలి. అమెరికాలో సెటిల్ అవ్వాలి. ఇదే సగటు భారతీయుడి కల. కొన్నేళ్లుగా అమెరికా పిచ్చి మన భారతీయులకు విపరీతంగా ఎక్కేసింది. ఎంతలా అంటే ఇక్కడ డిగ్రీ అయిపోగానే అమెరికా వెళ్తేనే సమాజంలో గుర్తింపు అనేలా పరిస్థితి తయారైంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు అమెరికాలో ఉన్నారంటూ ఇక్కడ బంధువులకు గర్వంగా చెప్పుకుంటూ మురిసిపోతూ ఉంటారు. అంతా భారతీయుల మెదళ్లలోకి అమెరికా పదం చొచ్చుకుపోయింది.
ఇంతవరకు బాగానే ఉన్న అక్కడికి వెళ్లిన వారి పరిస్థితి ఎలా ఉందో ఎవరూ పట్టించుకోరు. వేల మంది వెళ్తే వందల మంది మాత్రమే బాగా సెటిల్ అవుతున్నారు. మిగిలిన వారు పరువు పోతుందేమ్ఓ అని భయపడుతూ చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉంటే అగ్రరాజ్యంలో జాతి వివక్ష విపరీతంగా ఉంటుంది. అది తట్టుకుని నిలబడాలి. ఎక్కడో చోట ఎవరికో ఒక్కరికి వివక్ష ఎదురవుతూనే ఉంటుంది. మరోవైపు రోజురోజుకు భారతీయుల సంఖ్య ఎక్కువకావడంతో అమెరికన్లు కొత్త నినాదం ఎత్తుకున్నారు.
ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ కూడా వలసవాదుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అమెరికన్లు కూడా రెచ్చిపోతున్నారు. తమ దేశంలో నివసించే భారతీయులు తిరిగి వెళ్లిపోవాలని డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. తమ ఉద్యోగ అవకాశాలను కొల్లగొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా అమెరికా నుంచి వెళ్లిపోవాలంటూ ఓ భారతీయుడిని అమెరికన్ హెచ్చరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: మస్క్ కొత్త పార్టీ ప్రకటనపై ట్రంప్ ఫైర్
ఓ షాపింగ్ మాల్ వద్ద కారు పార్క్ చేసి వస్తున్న భారతీయుడిని చూసి ఓ అమెరికన్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. అమెరికాకు ఎందుకొచ్చావ్.. ఇండియాకు వెళ్లిపో అంటూ హెచ్చరించాడు. మా అమెరికాలో భారతీయులు ఎక్కువ మంది ఉంటున్నారని.. మీరు ఇక్కడ ఉండటం తనకు నచ్చట్లేదని తెలిపాడు. మీరంతా మా దేశం నుంచి తిరిగి వెళ్లిపోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ భారతీయుడు మాత్రం సెలైంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. అమెరికాకు వెళ్లి అక్కడ జరిగే దాడులతో, జాతి వివక్ష వ్యాఖ్యలతో ఇబ్బందులు పడే బదులు మన దేశంలోనే చక్కగా పనిచేసుకోవచ్చు కదా అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ఇటీవల అమెరికాలో భారతీయులకు రక్షణ లేకుండా పోతుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.


