Sunday, November 16, 2025
Homeఇంటర్నేషనల్Floods: భారీ వరదలు.. చూస్తుండగానే డ్యామ్ మాయం!

Floods: భారీ వరదలు.. చూస్తుండగానే డ్యామ్ మాయం!

Texas Floods: సెంట్రల్ టెక్సాస్ ప్రాంతాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఈ రాకాసి వరదల కారణంగా చిన్నారులతో సహా 80 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 27 మంది బాలికలు అదృశ్యమయ్యారు. వరదల తీవ్రతను ప్రతిబింబించేలా, కేవలం రెండు నిమిషాల్లో ఓ భారీ వంతెన ప్రవాహంలో కొట్టుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జులై 4వ తేదీన, టెక్సాస్‌లో కొన్ని గంటల వ్యవధిలో దాదాపు 10 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది అక్కడి సగటు వార్షిక వర్షపాతంలో మూడో వంతుకి సమానమని వాతావరణ శాఖ తెలిపింది. ఈ భారీ వర్షాలకు నదులు ఒక్కసారిగా ఉప్పొంగి ఊహించని విధంగా వరదలు వచ్చాయి. కెర్ కౌంటీ ఈ విపత్తుకు కేంద్రబిందువుగా మారింది. అక్కడ 40 మంది పెద్దలు, 28 మంది చిన్నారులు మృతి చెందారని షెరిఫ్ లారీ లీథా వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

గ్వాడలుపే నది ఒడ్డున ఏర్పాటు చేసిన ఒక క్రిస్టియన్ సమ్మర్ క్యాంప్ నుంచి 27 మంది బాలికలు గల్లంతయ్యారని తెలుస్తోంది. రక్షణ బృందాలు వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇతరత్రా దృశ్యాల్లో, కింగ్స్‌ల్యాండ్‌లోని లానో నదిపై ఉన్న ఓ వంతెన వరద ప్రవాహానికి శిథిలమై, కేవలం రెండు నిమిషాల్లోనే పూర్తిగా మునిగిపోయింది. సాధారణంగా నిదానంగా ప్రవహించే ఆ నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చిన తీరు వీడియోలో స్పష్టంగా కనపడుతోంది. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad