Tuesday, December 3, 2024
Homeఇంటర్నేషనల్Coffee and Milkshake : కాఫీ, మిల్క్ షేక్ అమ్మి జైలుపాలైన వ్యక్తి.. ఏం చేశాడంటే..

Coffee and Milkshake : కాఫీ, మిల్క్ షేక్ అమ్మి జైలుపాలైన వ్యక్తి.. ఏం చేశాడంటే..

మాదకద్రవ్యాలు అంటే.. గంజాయి, కొకైన్, డ్రగ్స్ వంటి వాటిని అమ్మితే ఏ దేశంలోనైనా జైల్లో వేయడం ఖాయం. కానీ ఓ వ్యక్తి కాఫీ, మిల్క్ షేక్ అమ్మి జైలుపాలయ్యాడు. ఇదెక్కడి విడ్డూరం అనుకోకుండి. అతను చేసిన నిర్వాకం అలాంటిది మరి. తమ దేశం ఆంక్షలు విధించిన దేశానికి ఏవైనా అమ్మితే జైలుకు వెళ్లాల్సిందే మరి. సింగపూర్ కు చెందిన ఓ వ్యాపారి ఈ తప్పే చేశాడు. ఉత్తర కొరియాపై సింగపూర్ కొన్ని ఆంక్షలు విధించగా.. ఆ జాబితాలో డ్రింక్స్ కు సంబంధించిన నిషేధాలు కూడా ఉన్నాయి. కానీ.. వాటికి విరుద్ధంగా షే హీ (58) అనే వ్యాపారి రూ.8 కోట్ల విలువైన కాఫీ, మిల్క్ షేక్ పదార్థాలను విక్రయించాడు.

- Advertisement -

నిషేధం ఉన్న దేశంతో ఇంత పెద్ద మొత్తంలో వ్యాపారం చేయడంతో అతడిని అరెస్ట్ చేసి జైలులో వేశారు. ఐక్యరాజ్య సమితి నిబంధనలకు విరుద్ధంగా న్యూక్లియర్, బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలు చేసింది ఉత్తర కొరియా. దీంతో ఆ దేశంతో 2017లో సింగపూర్ వ్యాపార సంబంధాల్ని తెంచుకుంది. 2017 అనంతరం షే హీ (58) అనే వ్యాపారి మాత్రం ఉత్తర కొరియాతో తన వ్యాపార సంబంధాలను కొనసాగించాడు. బేవరేజెస్ వ్యాపారంలో ఉన్న ఆయన.. ఉత్తర కొరియాకు 8 కోట్ల రూపాయల కాఫీ, మిల్క్ షేక్ పదార్థాలను విక్రయించాడు. ఇది తెలుసుకున్న సింగపూర్ ప్రభుత్వం.. నిషేధం ఉన్న దేశంతో ఇంత పెద్ద మొత్తంలో వ్యాపారం చేయడంతో అతడిని అరెస్ట్ చేసి జైలుకి పంపింది.

కాగా.. షే హీ కమీషన్ పొందేందుకు ఈ వ్యాపారం చేయలేదని అతడి తరపు న్యాయవాది కోర్టుకు తెలుపగా.. కమీషన్ పొందనప్పటికీ.. అతని ఖాతాలో నెలవారీ అమ్మకాల లక్ష్యాలను చేరుకోవడానికి మాత్రం ఉత్తర కొరియాతో రహస్య ఒప్పందం చేసుకున్నాడని కోర్టు పత్రాలు వెల్లడించాయి. అతడు చేసింది నేరంగా పరిగణించింది. ఇలా దేశ నిషేధాలను ఉల్లంఘించిన వారికి.. గరిష్టంగా 1,00,000 సింగపూర్ డాలర్లు జరిమానా లేదా ఎగుమతి చేసిన వస్తువుల విలువకు మూడు రెట్లు జరిమానాతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. ఒక్కోసారి రెండు శిక్షలూ వేస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News