Earthquake: ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం సంభంవించింది. సోమవారం మధ్యాహ్నం కొన్ని సెకన్ల పాటు కంపించిన ఈ భూప్రకంపనల వల్ల వందల ఇళ్లు, కొన్ని నిర్మా ణాలు కూలిపోయాయి. ఈ భూకంపం ధాటికి 20 మంది మరణించగా.. 300 వందల మందికి పైగా గాయపడ్డారు. ఇండోనేషియాలోని వెస్ట్ జావాలో సోమవారం మధ్యాహ్నం ఈ భూకంపం సంభవించింది.
5.6 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించగా.. భూమి ప్రకంపనలతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉండగా అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
ఐదు రోజుల క్రితమే ఇండోనేషియాలో భూకంపం కనిపించింది. సుమత్రా దీవుల్లో నైరుతి దిశలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ మీద ఈ భూకంప తీవ్రత 6గా నమోదవగా అప్పుడు ఎలాంటి ప్రాణ నష్టం లేదు. కానీ సోమవారం సంభవించిన భూకంపం నివాస ప్రాంతాలపై ప్రభావం చూపింది. దీంతో భారీ ప్రాణ, ఆస్థి నష్టం సంభవించింది.