Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Harvard University : ట్రంప్ ప్రభుత్వానికి ఫెడరల్ కోర్టు షాక్.. హార్వర్డ్‌పై కక్ష సాధింపు కుదరదు!

Harvard University : ట్రంప్ ప్రభుత్వానికి ఫెడరల్ కోర్టు షాక్.. హార్వర్డ్‌పై కక్ష సాధింపు కుదరదు!

Trump Harvard funding lawsuit :  ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం– వైట్‌హౌస్ మధ్య నెలకొన్న వివాదం తీవ్ర స్థాయికి చేరుకోగా, ఆ పోరులో ట్రంప్ సర్కార్‌ చివరికి ఒక పెద్ద దెబ్బ తిన్నట్టైంది. విశ్వవిద్యాలయంపై రాజకీయ కక్ష సాధింపు చర్యగా నిలిపివేసిన 2.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 21,700 కోట్లు) భారీ నిధులను తక్షణమే విడుదల చేయాలని ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పు కేవలం హార్వర్డ్‌కు మాత్రమే కాక, దేశంలోని విద్యాసంస్థల స్వేచ్ఛకు లభించిన గొప్ప విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. 

- Advertisement -

ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి లేఖ పంపింది. అందులో నియామకాలు, ప్రవేశాలు మార్చాలని, ఫేస్ మాస్క్‌లు నిషేధించాలని, పాలస్తీనా మద్దతు నిరసనలు ఆపాలని కోరింది. అయితే, ఈ డిమాండ్లను హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు అలాన్ గార్బర్ తీవ్రంగా వ్యతిరేకించారు. “విశ్వవిద్యాలయాల్లో ఏమి బోధించాలి, ఎవరిని నియమించుకోవాలి, ఏ పరిశోధనలు చేయాలో ప్రభుత్వాలు నిర్దేశించకూడదు” అని ఆయన స్పష్టం చేశారు. ఈ తిరస్కరణను తీవ్రంగా పరిగణించిన ట్రంప్ ప్రభుత్వం, హార్వర్డ్‌కు వెళ్లే కీలకమైన ఫెడరల్ నిధులను స్తంభింపజేస్తూ ప్రతీకార చర్యలకు దిగింది.

ఫెడరల్ కోర్టు కొట్టిన దెబ్బ : ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హార్వర్డ్ కోర్టును ఆశ్రయించగా, ఫెడరల్ కోర్టు ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుబట్టింది. ఇది “స్పష్టమైన రాజకీయ ప్రతీకారం” అని అభివర్ణించింది. విశ్వవిద్యాలయంలో యూదులపై వ్యతిరేకత పెరిగిపోతోందన్న ప్రభుత్వ వాదనను కోర్టు తోసిపుచ్చింది. నిధుల నిలిపివేతను సమర్థించుకోవడానికి “యూదు వ్యతిరేకతను ఒక కవచంగా వాడుకున్నారు” అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ తీర్పుతో నిధుల కొరత కారణంగా మధ్యలో నిలిచిపోయిన వందలాది పరిశోధన ప్రాజెక్టులకు పునర్జీవం లభించినట్లయింది.

విదేశీ విద్యార్థులపై వేటు : నిధుల నిలిపివేతతో ఆగని ట్రంప్ సర్కార్, 2025-26 విద్యా సంవత్సరం నుంచి హార్వర్డ్‌లో కొత్త విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై నిషేధం విధించింది. ఇప్పటికే చదువుతున్న వారు మరో విశ్వవిద్యాలయానికి మారాలని, లేదంటే దేశం విడిచి వెళ్లాలని హెచ్చరించింది. 140కి పైగా దేశాల నుంచి వేలాది మంది విద్యార్థులు చదువుకునే హార్వర్డ్ వంటి సంస్థపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపింది. హార్వర్డ్‌తో పాటు కొలంబియా, పెన్సిల్వేనియా, కార్నెల్ వంటి ఇతర ప్రముఖ విశ్వవిద్యాలయాలపైనా ట్రంప్ సర్కార్ ఇలాంటి చర్యలకే పాల్పడింది. అయితే, తాజా కోర్టు తీర్పుతో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై విధించిన నిషేధంపై కూడా పునరాలోచన చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad