ఫిలిప్పైన్స్ ను భారీ భూకంపం కుదిపేసింది. రెక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 7.6గా నమోదైంది. కాగా సునామీ అలర్ట్ సైతం జారీ చేయటంతో ఫిలిప్పైన్స్ మరింత వణికిపోతోంది. యుఎస్ సునామీ వార్నింగ్ జారీ చేయటంతో ఫిలిప్పైన్ ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఉన్నారు. ఫిలిప్పైన్స్ దక్షిణ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. గత నెల నవంబర్ 17వ తేదీన కూడా ఫిలిప్పైన్స్ లో భూకంపం సంభవించింది. ఇంకా ఆ భయం నుంచి ఫిలిప్పైన్ ప్రజలు బయటపడకముందే మరో భయానకమైన భూకంపం రావటంతో ఈ దేశం చితికిపోతోంది.
ఇండోనేషియాపై కూడా భూకంపం ప్రభావం తీవ్రంగా చూపింది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పైన ఉన్న ఫిలిప్పైన్స్ లో భూకంపాలు తరచూ సంభవిస్తూనే ఉంటాయి. ఇక్కడి భూమి లోపల పొరలు తరచూ కదులుతుండటం వల్ల ఇక్కడ భూకంపాలు ఎక్కువగా వస్తాయి. టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల ఇక్కడ చిన్నా చితకా భూకంపాలు వస్తూనే ఉంటాయి. అందుకే ఇక్కడి ప్రజలు చిన్న చిన్న భూకంపాలకు పూర్తిగా అలవాటు పడి, అందుకు తగ్గట్టుగానే ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటారు.