భూకంప శాస్త్రవేత్తల తాజా ప్రకటనలు కాళ్ల కింద భూమిని కదిలేలా ఉన్నాయి. ఓవైపు 24 గంటల్లోగా మూడు భారీ భూకంపాలను టర్కీ ఎదుర్కొని.. ఒక రోజులోనే వందలసార్లు భూప్రకంపనల ధాటికి కుప్పకూలింది. అయితే తాజాగా ఈ దేశం పక్కకు జరిగిందని సెస్మాలజిస్టులు చెబుతుండటం షాకింగ్ గా మారింది. భూకంపాలకు నెలవైన టర్కీలో తరచూ భూమి లోపలి పొరల్లో కదలికలు వస్తూనే ఉంటాయి. దీంతో స్వల్ప భూకంపాలకు వీళ్లు చాలా కాలంగా అలవాటు పడ్డారు. అయితే తాజాగా సంభవించిన భారీ భూకంపంతో ఏకంగా టర్కీ దేశం 5-6 మీటర్ల మేర పక్కకు జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ముంబై సిటీకూడా ఏటా కుంచించుకు పోతోందనే వాదన శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. చెన్నైదీ ఇదే పరిస్థితి. ఆమధ్య కొందరు శాస్త్రవేత్తలు హైదరాబాద్ కూడా కుంచించుకుపోతోందంటే నమ్మరెందుకన్నారు. చూస్తుంటే ఈ విషయాలను మానవాళి అస్సలు నిర్లక్ష్యం చేయకూడదనే హెచ్చరికలు గట్టిగా వినిపిస్తున్నాయి.