Friday, April 25, 2025
Homeఇంటర్నేషనల్United Nations: భారత్‌, పాక్‌ సంయమనం పాటించండి..ఐక్యరాజ్యసమితి సూచన

United Nations: భారత్‌, పాక్‌ సంయమనం పాటించండి..ఐక్యరాజ్యసమితి సూచన

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండిచిన సంగతి తెలిసిందే. ఈ దాడి అనంతరం భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా ఈ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి(United Nations) స్పందించింది.

- Advertisement -

ఈ ఆందోళనకర పరిస్థితిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ (Antonio Guterres) నిశితంగా పరిశీలిస్తున్నారని అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ తెలిపారు. ఉగ్రదాడిని యూఎన్‌ తీవ్రంగా ఖండిస్తోందన్న ఆయన పౌరులపై దాడి అనేది ఏమాత్రం ఆమోద‌యోగ్యం కాదన్నారు. ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలని సూచించారు. ఇరుదేశాల మధ్య ఏదైనా సమస్య ఉంటే శాంతియుత చర్చలతో వాటిని పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News