Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్US Shutdown: అమెరికాలో షట్‌డౌన్ ఎఫెక్ట్‌.. 8 వేల విమాన సర్వీసులకు అంతరాయం

US Shutdown: అమెరికాలో షట్‌డౌన్ ఎఫెక్ట్‌.. 8 వేల విమాన సర్వీసులకు అంతరాయం

US Government Shutdown 2025: అగ్రరాజ్యం అమెరికాలో షట్‌డౌన్ కొనసాగుతోంది. షట్‌డౌన్‌ కారణంగా విమాన సర్వీసులపై భారీగా ఎఫెక్ట్ పడింది. అమెరికాలో ఆదివారం ఒక్కరోజే దాదాపు 8 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. చాలాచోట్ల ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది విధులకు హాజరుకాలేదు. దీంతో వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన 22 ప్రాంతాల్లో ఎయిర్ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) సిబ్బంది కొరత ఏర్పడింది. అంతేకాదు, రాబోయే రోజుల్లో సిబ్బంది కొరత ఇంకా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని.. దీనివల్ల విమానాల ఆలస్యం కావడం, సర్వీసులు రద్దు కావడం వంటి మరిన్ని ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని అమెరికా రవాణా మంత్రి శాన్‌డఫీ వెల్లడించారు. అమెరికా కాలమాన ప్రకారం చూసుకుంటే ఆదివారం రాత్రి 11 గంటలకు దాదాపు 8 వేలకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు అక్కడి లోకల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌లో 2 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. షట్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 1200, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 739, డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 600 విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. లాస్‌ ఏంజెలెస్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో సిబ్బంది కొరత వల్ల విమాన సర్వీసులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దాదాపు రెండు గంటల పాటు ఆ ఎయిర్‌పోర్టుకు విమాన రాకపోకలు ఆగిపోయాయి. న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ ఎయిర్‌పోర్టుల్లో కూడా ఈ సమస్య నెలకొన్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అక్టోబర్ 1 నుంచి షట్‌డౌన్ కొనసాగుతోంది. కాగా, ఈ షట్‌డౌన్‌ కారణంగా దాదాపు 13 వేల మంది ఏటీసీ, 50 వేల మంది ట్రాన్స్‌పోర్ట్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఎలాంటి జీతాలే లేకుండానే పని చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో, కొందరు ఏటీసీ సిబ్బంది విధులకు డుమ్మా కొట్టడంతో విమాన రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. తాజా షట్‌డౌన్‌ దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత వచ్చింది. రిపబ్లికన్లు, డెమోక్రట్ల మధ్య బడ్జెట్‌పై విబేధాల కారణంగా షట్‌డౌన్‌ ప్రకటించల్సిన పరిస్ధితి ఏర్పడింది. ట్రంప్ అధికారులు మాస్ లేఅవుట్‌లు ప్రకటించారు. దీని వల్ల ఆర్థిక అనిశ్చితి పెరిగింది.

- Advertisement -

షట్‌డౌన్ అంటే ఏమిటి?

అమెరికా ప్రభుత్వం ఖర్చుల కోసం అవసరమైన ఫండ్స్ వెచ్చించలేని పరిస్థితినే షట్‌డౌన్ అంటారు. షట్‌డౌన్‌ కారణంగా ఫెడరల్ ఏజెన్సీలు మూతపడతాయి. ఉద్యోగులకు సెలవులిస్తారు. లేదా డిస్మిస్ అవుతారు. ఈసారి సుమారు 7,50,000 ఫెడరల్ వర్కర్లు ప్రభావితమయ్యారు. జస్టిస్ డిపార్ట్‌మెంట్ కేసులు ఆగిపోతాయి. ఎడ్యుకేషన్ గ్రాంట్లు ఇవ్వడం ఆపేస్తారు. సూపర్‌ఫండ్ సైట్ల క్లీనప్ ఆగుతుంది. అమెరికాలో పనిచేసే ఎన్‌ఆర్‌ఐలకు ఇది తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఐటీ, హెల్త్‌కేర్, ఫెడరల్ కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్న ఉద్యోగుల సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా జీతాలు రాక.. హోమ్ లోన్‌లు, క్రెడిట్ స్కోర్‌లు ప్రభావితమవుతాయి. ట్రంప్ లేఅవుట్‌లు ప్రకటించడంతో జాబ్ సెక్యూరిటీ మరింత తగ్గుతోంది. ప్రస్తుతం, భారతీయులు అమెరికాలో 50 లక్షల మంది ఉండగా, వారిలో 10 శాతానికి పైగా ఫెడరల్ సంబంధిత రంగాల్లో పనిచేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad