America: ప్రస్తుతం అమెరికాలో గ్రీన్‌కార్డులు, వీసాల జారీ, వలసపోవడం కష్టతరంగా మారాయి. యూఎస్ సీఐఎస్ ప్రచురించిన డేటాషీట్ ప్రకారం ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 16 లక్షల కొత్త దరఖాస్తులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో ఇమ్మిగ్రేషన్ బ్యాక్ లాగ్ లో 1.13 కోట్ల దరఖాస్తులు ఉన్నాయి. గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులు వాడే ఫారమ్ ఐ-90 సగటు వెయిటింగ్ టైమ్ 0.8 నెలల నుంచి 8 నెలలకు చేరింది. ఫారమ్ ఐ-765ల్లో దాదాపు 2 మిలియన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో భారతీయులకు గ్రీన్‌కార్డుల్లో భారీ జాప్యం ఎదురవుతుంది. రెండో త్రైమాసికంలో ప్రాసెస్ చేసిన దరఖాస్తులు గతేడాది 3.3 మిలియన్లు చేయగా.. ఈసారి 2.7 మిలియన్లకే పరిమితమైంది.
ప్రస్తుతం అమెరికాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్పొరేట్ లీడర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల వర్క్ పర్మిట్‌లు ముగియడంతో వారి ఉద్యోగం కోల్పోవలసి వస్తుంది. వాటి పునరుద్ధరణ వెంటనే జరగకపోవడంతో వారు పదవుల నుంచి వైదొలగాల్సివస్తోంది. గ్రీన్‌కార్డ్‌ల జారీలో జాప్యం వల్ల.. కొన్నేళ్లుగా అమెరికాలో వివిధ కంపెనీల్లో పని చేస్తున్నవారు కూడా ఆ దేశాన్ని విడిచి వెళ్లేలా చేస్తుంది.
Readmore: https://teluguprabha.net/international-news/indonesian-passenger-ferry-catches-fire-at-sea/
అమెరికాలోనే అతిపెద్దదైన మెట్రోపాలిటన్ ర్యాపిడ్ ట్రాన్సిట్ అథారిటీ సీఈవోగా కొల్లిన్ గ్రీన్‌వుడ్ 2022 జనవరిలో బాధ్యతలు చేపట్టారు. గ్రీన్‌వుడ్ పదవి బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజుల్లోనే మార్టా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. జూన్ 18న ఆయన వర్క్ పర్మిట్ కాలవ్యవధి ముగిసిపోయింది. దీంతో గ్రీన్‌వుడ్ ముందస్తు రిటైర్మెంట్ ని ఎంచుకున్నాడు. అలా జూలై17న పదవి నుండి దిగిపోయారు. గ్రీన్‌కార్డ్ జారీలో జాప్యంతో ఆయన తన పదవిలో కొనసాగడం అసాధ్యంగా మారింది. అమెరికా రవాణారంగంలో పలువురు హైప్రొఫైల్ అధికారులు రాజీనామాల పరంపరలో గ్రీన్‌వుడ్‌ది కూడా ఒకటి. వీరిలో చాలామంది ఆపరేషనల్ సవాళ్లు, ఇమిగ్రేషన్ టైమ్‌లైన్ వంటి కారణాలతో ఉద్యోగాలను వదిలేశారు.
ట్రంప్ సర్కార్ వచ్చినప్పటి నుండి పెండింగ్ దరఖాస్తుల సంఖ్య ఎక్కువ అయిపోయింది. ఈ స్థాయిలో పెండింగ్ లో ఉండటం అనేది ట్రంప్ సర్కార్ సృష్టించిన రికార్డ్. ప్రస్తుతం అమెరికాలో గ్రీన్‌కార్డులు, వీసాల జారీ, వలసపోవడం కష్టతరంగా మారాయి. అయితే.. వీటిల్లో వీసాలు, గ్రీన్‌కార్డుల జారీలో జాప్యం జరుగుతుంది. దీంతో ప్రస్తుతం ఆ దేశ కార్పొరేట్ రంగంపై దుష్ప్రభావం చూపడం ప్రారంభమైంది. ఇప్పటికైనా ట్రంప్ సర్కార్ ఇది గమనించి గ్రీన్ కార్డ్, వీసాల జారీలో ఆలస్యం లేకుండా చూడాలి.


