అవును.. మీరు చదివినది నిజమే. అగ్రరాజ్యం భారత్ పై తాజాగా అభిప్రాయపడుతున్న విషయానికి అక్షర రూపం. ఇది వైట్ హౌస్ కు భారత్ మీద, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్న విశ్వాసానికి ప్రతిరూపం.
- Advertisement -
మోడీ తలచుకుంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలరని.. ఆశక్తి మోడీకి ఉందని అమెరికా బాహాటంగా ప్రకటించడం విశేషం. ఇది యుద్ధాల శకం కాదని రష్యా అధ్యక్షుడికి మోడీ చెప్పటాన్ని గతంలో ప్రపంచం అంతా చూసింది. ఉక్రెయిన్-రష్యాల మధ్య ఉన్న టెన్షన్ తగ్గించేందుకు భారత్ చేసే ఏ కృషినైనా అమెరికా స్వాగతిస్తుందని వైట్ హౌస్ తెలిపింది. ఈమేరకు వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ జాన్ కిర్బీ ప్రకటన వెలువరించారు.