Vatican Officially Welcomes First-Ever LGBTQ Pilgrimage: రెండు వేల ఏళ్ల కాథలిక్ చర్చి చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారిగా, 1,400 మందికి పైగా LGBTQ (స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లు) కాథలిక్కులు, వారి మద్దతుదారులతో కూడిన బృందం వాటికన్‌లో అధికారిక యాత్రను చేపట్టింది. చర్చి నిర్వహిస్తున్న ‘జూబలీ’ పవిత్ర సంవత్సరంలో భాగంగా ఈ యాత్రకు అధికారికంగా అనుమతి లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ALSO READ: Internet : సముద్రంలో కేబుల్స్ తెగిపోయి భారత్-పాక్ సహా ఆసియాలో ఇంటర్నెట్ బంద్
ఇటలీకి చెందిన ‘లా టెండా డి జియోనాటా’ అనే సంస్థ ఈ యాత్రను నిర్వహించింది. 20 దేశాల నుంచి తరలివచ్చిన యాత్రికులు, ఇంద్రధనస్సు వర్ణాలతో ఉన్న సిలువను చేతబూని, సెయింట్ పీటర్స్ బసిలికాలోని పవిత్ర ద్వారం గుండా లోపలికి ప్రవేశించారు. గతంలో LGBTQ బృందాలు వాటికన్‌ను సందర్శించినా, చర్చి అధికారిక కార్యక్రమంలో చోటు దక్కడం ఇదే ప్రప్రథమం.
బయటి వ్యక్తులం కాదు.. కుటుంబంలో భాగమే..
“మమ్మల్ని బయటివారిగా చూసి స్వాగతించడం కాదు, మేము కూడా ఇదే కుటుంబంలో భాగం అని గుర్తించాలి,” అని బ్రస్సెల్స్‌కు చెందిన 68 ఏళ్ల ట్రాన్స్‌జెండర్ మహిళ యైవ్లిన్ బెహెట్స్ ఆకాంక్షించారు. కెనడాకు చెందిన హ్యూగో మాట్లాడుతూ, “చర్చిలో మమ్మల్ని కూడా కలుపుకుపోతున్నారనడానికి ఇదొక ముఖ్యమైన సంకేతం. ఇది చూసి ఇతరులు కూడా మాలాగే స్వలింగ సంపర్కుల పట్ల మరింత సానుకూలంగా మారతారని ఆశిస్తున్నాను,” అని అన్నారు.
ALSO READ: Trump: వెనుజువెలా హస్తగతం చేసుకునేందుకు ట్రంప్ ప్రయత్నాలు..!
పోప్ ఫ్రాన్సిస్ విశాల దృక్పథం.. వివాదాస్పదం
గత ఏప్రిల్‌లో మరణించిన పోప్ ఫ్రాన్సిస్, చర్చి తలుపులు అందరి కోసం తెరిచి ఉంచాలని ప్రయత్నించారు. స్వలింగ జంటలను ప్రీస్టులు ఆశీర్వదించడానికి ఆయన అనుమతించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆయన తర్వాత వచ్చిన ప్రస్తుత పోప్ లియో XIV, వివాహం అనేది స్త్రీ, పురుషుల మధ్యే జరగాలని స్పష్టం చేసినా, ఫ్రాన్సిస్ నిర్ణయాన్ని మాత్రం మార్చలేదు.
“మా పిల్లలు ఏదో తప్పు చేస్తున్నారనే భావనను చర్చిలో కలిగిస్తున్నారు. ఈ ఆలోచనా ధోరణి కచ్చితంగా మారాలి. అందుకు కింది స్థాయి నుంచి ప్రీస్టులకు, బిషప్‌లకు శిక్షణ ఇవ్వాలి,” అని యాత్రలో పాల్గొన్న ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ: Russia: 800 డ్రోన్లు, క్షిపణులతో విధ్వంసం.. కీవ్ పై రష్యా భీకర దాడి..!


