ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్(Warren Buffett) తన వారసుడిని ప్రకటించారు. తన రెండో కుమారుడు హువర్డ్ బఫెట్.. బెర్క్‌షైర్ హత్‌వే కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారని ప్రకటించారు. తన సంపదలో అత్యధిక మొత్తం కొత్తగా ఏర్పాటు చేసిన ఛారిటబుల్ ట్రస్ట్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. తన ముగ్గురు పిల్లలకు తక్కువ సంపద మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు. అయితే తన వారసులే 140 బిలియన్ డాలర్ల ట్రస్ట్ దాతృత్వ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారన్నారు. ఇక హువర్డ్ కూడా తన కుమారుడు కాబట్టే ఈ అవకాశం లభించిందన్నారు.
వారెన్ నిర్ణయంపై హువర్డ్ స్పందిస్తూ.. తాను ఈ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు భావిస్తున్నానని తెలిపారు. తనను ఇన్నేళ్లపాటు ఈ పదవి కోసం తన తండ్రి సిద్ధం చేశారని వెల్లడించారు. హువర్డ్ బెర్క్‌షైర్ బోర్డులో దాదాపు 30 ఏళ్ల పనిచేశారు. ప్రస్తుతం బెర్క్‌షైర్ వ్యాపార సామ్రాజ్యం విలువ సుమారు రూ.86 లక్షల కోట్లు.