Saturday, January 4, 2025
Homeఇంటర్నేషనల్Gen Beta: తరం మారింది.. కొత్త ఏడాదిలో కొత్త తరం

Gen Beta: తరం మారింది.. కొత్త ఏడాదిలో కొత్త తరం

నూతన సంవత్సరం(New Year) వచ్చేసింది. ప్రపంచమంతా 2024కు గుడ్ బై చెబుతూ.. 2025కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. అయితే గత సంవత్సరాలతో పోలిస్తే 2025 కాస్త స్పెషల్‌గా నిలవనుంది. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి ఓ తరం మారుతుంది. 2025 నుంచి 2039 వరకు పుట్టినవారు ‘జెన్ బీటా’(Gen Beta) తరానికి చెందిన వారిగా నిలుస్తారు.

- Advertisement -

వీరంతా 21 వ శతాబ్దానికి గుడ్ బై చెప్పి 22వ శతాబ్దానికి స్వాగతం పలికే వారు. ఏఐ టెక్నాలజీకి ఈ తరం సజీవ సాక్ష్యంగా నిలవబోతుంది. వీరి జీవితాలలో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషించనుందని నిపుణులు చెబుతున్నారు. మిగతా తరాలతో పోలిస్తే ‘జెన్ బీటా’ తరం పూర్తిగా అడ్వాన్స్డ్ గా ఉంటుందని వివరించారు. కాగా ప్రతి 15 సంవత్సరాలకు ఓ కొత్త తరంగా లెక్కిస్తారు.

ఎవరు ఏ తరమో ఒకసారి చూద్దాం..

1922 నుంచి 1927- గ్రేటెస్ట్ జనరేషన్
1928 నుంచి 1945- సైలెంట్ జనరేషన్
1946 నుంచి 1964- బేబీ బూమర్స్
1965 నుంచి 1980- జనరేషన్ ఎక్స్ (జెన్ ఎక్స్)
1981 నుంచి 1996- మిలీనియల్స్
1997 నుంచి 2012- జనరేషన్ జడ్ (జెన్ జెడ్)
2013 నుంచి 2024- జనరేషన్ ఆల్ఫా (జెన్ ఆల్ఫా)
2025 నుంచి 2039- జనరేషన్ బీటా (జెన్ బీటా)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News