కాస్త చలి ఎక్కువైతేనే మనం వణికిపోతుంటాం. ముఖ్యంగా దక్షిణాది ప్రజలకు మంచు కురిసే వాతావరణంలో పెద్దగా ఉండే అలవాటు ఉండదు. కానీ ప్రపంచంలో కోల్డెస్ట్ ప్లేస్ అయిన ఈ ప్రాంతంలో -50 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ప్రజలు ఎలా ఉంటున్నారనేది ఆశ్చర్యకరం.
వీళ్లను కదిలిస్తేమాత్రం..ఎక్కువ లేయర్లు బట్టలు వేసుకుంటే హ్యాపీగా బతికేయచ్చని తమ లైఫ్ సీక్రెట్ సింపుల్ గా చెప్పేస్తారు. యాకుట్స్క్ సిటీలో వీళ్లంతా చలిని ఏమాత్రం లెక్కచేయకుండా తమ రొటీన్ ను చేసుకుంటూ పోతున్నారు.
రష్యాలోని మాస్కో వద్ద ఉన్న ఈ మైనింగ్ సిటీలో రెగ్యులర్ గా టెంపరేచర్స్ అలా -40 వరకూ పడిపోతుంటాయి. సబ్జీరో టెంపరేచర్స్ కు బాగా అలవాటుపడ్డ ఇక్కడి సిటీ ప్రజలు జనవరి నెలలో మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని మరింత వెచ్చగా ఉండేలా ట్రై చేస్తారు. ఇక్కడి మార్కెట్లో ఫ్రిజ్జులు అసలుండవు..గడ్డ కట్టిన చేపలు, పళ్లు, కూరగాయలు చాలా ఫ్రెష్ గా ఉంటాయి. మీకు క్యాబేజీ తెలుసుకదా..అచ్చం దానిలా పొరపొరలు బట్టలు వేసుకుంటే చాలు బిందాస్ గా తిరిగేయచ్చు..చలిని జయించవచ్చని ఇక్కడి ప్రజలంతా చెబుతుండటం ఇంట్రెస్టింగ్ గా ఉంది.