Dates During Pregnancy: గర్భధారణ సమయంలో మహిళలు అనేక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో ఎంతో శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో అతిగా తినడం, త్రాగడం, బరువులు ఎత్తడం వంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అయితే, ఈ సమయంలో గర్భిణీలు డ్రై ఫ్రూట్స్ తినొచ్చా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. కొందరు ఖర్జూరాలను గర్భిణీలు తింటే మంచిదని భావిస్తే, మరికొందరు హానికరమని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిజంగా ఖర్జూరాలు గర్భిణీలకు ప్రమాదకరమా!?
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఖర్జూరం వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. కావున దీని పెద్ద మొత్తంలో తీసుకుంటే భర్భస్రావం, అకాల ప్రసవానికి కారణం అవుతుంది. ఖర్జూరం గర్భాశయం నోటికి మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. ఇది సాధారణ ప్రసవ అవకాశాలను పెంచుతుంది. అందుకే గర్భం దాల్చిన వెంటనే మహిళలు ఖర్జూరం తినడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఖర్జూరాలను ఐదవ నెల నుండి తీసుకోవడం ఉత్తమం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు గర్భధారణ సమయంలో ఖర్జూరాలను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
ఖర్జూరాలు శక్తికి గొప్ప వనరులుగా పనిచేస్తాయి. ఇందులో గ్లూకోజ్, ప్రక్టోజ్, సుక్రోచ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడుతాయి.
ఖర్జూరం జీర్ణవ్యవస్థకు ఎంత మంచిది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యను దూరం చేస్తుంది.
ఖర్జూరంలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు ఎముకలను బలోపేతం చేయడంలో ఎంతో సహాయపడతాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
గర్భధారణ సమయంలో మహిళలకు సామాన్యంగా రక్తహీనత ఉంటుంది. అలాంటివారు ఖర్జూరం తీసుకోవాలి. ఇందులో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ ను పెంచుతుంది.
ఖర్జూరంలో విటమిన్ సి, డి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడతాయి. అనేక వ్యాధులను కూడా దూరం చేస్తుంది.


