Sunday, November 16, 2025
Homeలైఫ్ స్టైల్Side Effects With Fruit Juices:పండ్లరసాలతో క్యాన్సర్ వ్యాప్తి? ఆందోళన కలిగిస్తోన్న టెక్సాస్ సర్వే వివరాలు..

Side Effects With Fruit Juices:పండ్లరసాలతో క్యాన్సర్ వ్యాప్తి? ఆందోళన కలిగిస్తోన్న టెక్సాస్ సర్వే వివరాలు..

side effects of drinking juice: కాన్సర్ ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది ఈ మహమ్మారి. అయితే ఈ అలవాటు ఎక్కువశాతం సిగరెట్, గుట్కాలు, ఆల్కహాల్ వంటి దురలవాట్లతో వస్తుందని చాలా మందికి తెలుసు కానీ అమెరికా టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన ఓ శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధనల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.క్యాన్సర్ వ్యాప్తికి మనం సాధారణంగా తాగే చక్కెర పానీయాలు, పండ్ల రసాలు వల్ల చివరి దశలో క్యాన్సర్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందని పరిశోధనలో తేలింది. ఈ సర్వేలో వెల్లడైన విషయాలు ప్రస్తుతం పలువురిని ఆందోళనకు గురి చేస్తోన్నాయి.

- Advertisement -

క్యాన్సర్ పై సర్వే ఎందుకు

అమెరికాలోని టెక్సాస్ వర్సిటీలో ఎండీ అండర్సన్ అనే క్యాన్సర్ కేంద్రం ఉంది. దీనికి చెందిన శాస్త్రవేత్తల బృందం చక్కెర పానీయాలలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మిశ్రమాలు అధికంగా ఉంటాయి. అయితే ఈ మిశ్రమం క్యాన్సర్ బాధితులపై ఏ విధంగా ఫలితం చూపుతుందనే విషయంపై శాస్త్రవేత్తలు లోతైన పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ‌్‌లు విడివిడిగా క్యాన్సర్ కణాల వ్యాప్తికి అధికంగా దోహాదపడకపోయినా ఈ రెండింటి కలయికతో కూడిన మిశ్రమం క్యాన్సర్ కణాలను చురుకుగా మార్చి అవి వేగంగా ఇతర అవయవాలకు వ్యాప్తి చెందేలా చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఈ మిశ్రమం తీసుకోవడం వల్ల మనిషి శరీర భాగాల్లో ప్రధానమైనా కాలేయానికి మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వెల్లడైంది. సాధారణంగా పెద్దప్రేగు క్యాన్సర్ అనేది అధికంగా కాలేయానికి వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే.

ALSO READ https://teluguprabha.net/lifestyle/expert-warns-against-wearing-nighties-all-day/

చక్కెర పానీయాలతో కాన్సర్ వ్యాప్తి జరుగుతుందా?

గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కలిపిన చక్కెర మిశ్రమాలు తీసుకోవడం ద్వారా మన శరీరంలోని సార్బిటల్ డీహైడ్రోజినేస్ (SORD) అనే ఎంజైమ్ ఉత్పత్తి అవుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ ఎంజైమ్ సాధారణంగా కొలెస్ట్రాల్‌ను నియంత్రించే విధంగా పనిచేస్తుంది. అయితే దీని ద్వారా క్యాన్సర్ కణాల వ్యాప్తి జరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే శరీరంలో సార్బిటాల్ డీహైడ్రోజినేస్ అనే ఎంజైమ్ ఎక్కువగా వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటే క్యాన్సర్ కణాల శరీరం మెుత్తం వ్యాప్తి చెందకుండా నియంత్రించవచ్చని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ బృందంలో ఒకరైన జన్యుశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ జిహ్యే యున్ మాట్లాడుతూ… ఈ సర్వేలో మనం తీసుకునే రోజువారీ ఆహారం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం మాత్రమే కాదు, వ్యాధి వచ్చిన తర్వాత అది ఎలా ముదురుతుందనే అనే వివరాలు స్పష్టమయ్యాయని తెలిపారు.

క్సాన్సర్ రోగులు పండ్లరసాలు తీసుకోవద్దా?

చాలా మంది క్యాన్సర్ రోగులకు పోషకాహారం కోసం వైద్యులు, ఆరోగ్య నిపుణులు అధిక చక్కెరలు ఉండే సప్లిమెంట్లు, పండ్ల రసాలను సిఫార్సు చేస్తుంటారు. అయితే టెక్సాస్ వర్సిటీ తాజా పరిశోధన నేపథ్యంలో క్యాన్సర్ రోగుల ఆహారపు అలవాట్ల విషయంలో ప్రధానంగా చక్కెర పానీయాల విషయంలో ఇచ్చే మార్గదర్శకాలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ అధ్యయనంలో మాత్రం క్యాన్సర్ రోగులు చక్కెర పానీయాలకు దూరంగా ఉండటం వల్ల వ్యాధి వ్యాప్తిని నియంత్రించవచ్చని తెలిసింది. ఈ అభిప్రాయాలు కేవలం టెక్సాస్ యూనివర్సిటీ నిపుణులవి మాత్రమే ఎదైనా నిర్ణయం తీసుకునేముందు డాక్టర్లను సంప్రదించి తీసుకోవడం ఉత్తమం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad