Saturday, June 14, 2025
Homeలైఫ్ స్టైల్Curd Benefits: పెరుగు తింటే ఎన్ని లాభాలో మీకు తెలుసా?

Curd Benefits: పెరుగు తింటే ఎన్ని లాభాలో మీకు తెలుసా?

Health Benefits Of Eating Curd: సాధారణంగా మనం భోజనాన్ని పెరుగన్నంతో ముగిస్తాము. పెరుగు తినగానే సంపూర్ణ భావన కలుగుతుంది. ఆరోగ్యనిపుణుల ప్రకారం పెరుగు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. ముఖ్యంగా పెరుగులో ప్రోబయోటిక్స్‌ పుష్కలంగా లభిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక ప్రాత పోషిస్తుంది. ఇందులో కాల్షియం, విటమిన్‌ బి12, మెగ్నీషియం, ప్రొటీన్‌ అధికంగా ఉంటాయి. అయితే పెరుగును ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్యలాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.

- Advertisement -

పెరుగు వల్ల కలిగే లాభాలు:

జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో పెరుగు సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్‌ చెడు బ్యాక్టీరియాను తొలగించి మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. మలబద్ధకం, గ్యాస్‌ సమస్యలు ఉన్నవాళ్ళు రోజు ఒక కప్పు పెరుగు తినడం వల్ల జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి. పెరుగును నేరుగా తినడానికి ఇష్టపడని వారు మజ్జిగలా చేసుకొని తాగవచ్చు.

రోగనిరోధక శక్తిని పెంచడంలో పెరుగు సహాయపడుతుంది. ఇందులో ఉండే ప్రోబయోటిక్‌ గుణాలు వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి. ముఖ్యంగా దగ్గు, జలుబుతో బాధపడేవారు ఆహారంలో పెరుగు చేర్చుకోవడం మంచిది. కాబట్టి పెరుగు అన్నం లేదా పెరుగతో తయారు చేసే పదార్థాలను తీసుకోండి.

సాధారణ పాల కంటే పెరుగులో కూడా కాల్షియం, విటమిన్ డి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా తయారు చేయడంలో సహాయపడుతాయి. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు పెరుగును ప్రతిరోజు తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్లో ఎమకలు దృఢంగా తయారు కావాలంటే పెరుగు ఆహారంలో చేర్చడం అవసరం.

బరువు నియంత్రణలో కూడా పెరుగు సహాయపడుతుంది. ఇందులో ప్రొటీన్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. ఇది అతిగా తినకుండా వెంటనే కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఆరోగ్యనిపుణుల ప్రకారం శరీరంలో ఉండే కొవ్వును పెరుగు సులభంగా కరిగిస్తుంది. కాబట్టి డైట్‌లో పెరుగు కూడా ఎంతో ముఖ్యం.

గుండె ఆరోగ్యానికి పెరుగు మంచి ఎంపిక. ఇందులో ఉండే పొటాషియం, ప్రోటీన్‌ రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తాయి. పెరుగులో మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలు అధికంగా ఉంటాయి కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

చర్మం, జుట్టు సమస్యలను తగ్గించడంలో కూడా పెరుగు ఎంతో సహాయపడుతుంది. ఇందులోఉండే యాంటీ- ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది. జుట్టు రాలే సమస్యలను కూడా తగ్గిచడంలో కీలక ప్రాత పోషిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News