ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర అవసరం అయితే.. మనుషులకు రోజుకి 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెబుతుంటారు. అయితే కొంత మంది మాత్రం అతిగా నిద్రపోతుంటారు. నిద్ర, బద్దకం విషయంలో మనుషుల కంటే ఎక్కువ నిద్రపోయే జంతువులు చాలానే ఉన్నాయి. ఈ లిస్ట్ లో పాములు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో పాములు ఘాడ నిద్రలోకి వెళ్లిపోతాయంట. ఈ కథనంలో పాములు రోజుకి ఎన్ని గంటలు పడుకుంటాయో తెలుసుకుందాం.
పాములు అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో ఒకటిగా పరిగణిస్తారు. చాలా పాములు కాటేస్తే మనిషి బతకడం కష్టమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పాములు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో.. పాముల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.. అవేంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే పాములు ఎంత నిద్రపోతాయి? ఇందులో కూడా సోమరితనానికి పర్యాయపదంగా భావించే కొండచిలువ పాము రోజుకు ఎన్ని గంటల నిద్ర పడుతుంది?
నిద్ర విషయంలో పాములు మనుషుల కంటే సోమరులు.. ఒక రోజులో పాము దాదాపు 16 గంటలు పడుకుంటుందంట. దీనికే ఆశ్చర్యం అనిపిస్తుందా.. నిజానికి ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో కనిపించే పాములకైతే బద్దక రత్న బిరుదు ఇవ్వొచ్చు.. ఎందుకంటే ఇక్కడ కనిపించే పైథాన్ స్నేక్ రోజుకి 18 గంటలు పడుకుంటాయంట. అంటే కేవలం రోజుకి ఆరు గంటలు మాత్రమే మేల్కొని ఉంటాయి. ఆ సమయంలో వేటకు వెళ్తాయి.
పాములకు చల్లటి వాతావరణంలో బయటకు రావడానికి ఇష్టపడవు. అందుకే శీతాకాలంలో ఎక్కువ నిద్రపోతుంటాయి. ఆ సమయంలో చలి కాలంలో పాములు 20 నుంచి 22 గంటల పాటు నిద్రపోతాయని చెబుతారు. ఇక కొండ చిలువ అయితే ఒకసారి ఆహారం సంపాదించి.. రోజుల తరబడి పడుకుంటుందంట. నిజానికి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని పాములూ విషపూరితమైనవి కావు. భూమిపై గుర్తించిన 3 వేల 600 పాము జాతుల్లో కేవలం 600 జాతులకు మాత్రమే విషం ఉంటుంది. వీటిలో కేవలం 200 జాతుల పాముల నుంచి మాత్రమే మనుషులకు ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
పాము విషం బలమైనది. వాటి కదలికలు కూడా చాలా వేగంగా ఉంటాయి. కింగ్ కోబ్రా ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే పాములలో ఒకటిగా చెపుతుంటారు. దీని వేగం సెకనుకు 3.33 మీటర్లు. అదే సమయంలో, కింగ్ కోబ్రా జీవితకాలం ఇతర పాముల కంటే ఎక్కువ. ఇది దాదాపు 20 సంవత్సరాల వరకు బతుకుతుందంట. ఇక మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు రెండు లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు.. వీరిలో 50 వేల మంది ప్రాణాలు విడుస్తున్నట్లు నివేదికలు చెబుతున్నారు.